Broom | సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపంగా భావించే చీపురును.. ఇంట్లో ఏ దిశ‌లో ఉంచితే మంచిది..?

Broom | చాలా మంది వాస్తు నియ‌మాలు పాటిస్తుంటారు. ఇంట్లో వ‌స్తువుల‌ను ఎక్క‌డంటే అక్క‌డ పెట్ట‌కుండా, వాస్తు ప్ర‌కారం వాటికి ప్ర‌త్యేక స్థానాన్నికేటాయిస్తుంటారు. ఆ స్థానంలోనే ఆ వ‌స్తువుల‌ను ఉంచుతారు. అలా చేయ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెరిగి, ల‌క్ష్మీక‌టాక్షం క‌లుగుతుంద‌నేది న‌మ్మ‌కం.

  • Publish Date - June 14, 2024 / 07:37 AM IST

Broom | చాలా మంది వాస్తు నియ‌మాలు పాటిస్తుంటారు. ఇంట్లో వ‌స్తువుల‌ను ఎక్క‌డంటే అక్క‌డ పెట్ట‌కుండా, వాస్తు ప్ర‌కారం వాటికి ప్ర‌త్యేక స్థానాన్నికేటాయిస్తుంటారు. ఆ స్థానంలోనే ఆ వ‌స్తువుల‌ను ఉంచుతారు. అలా చేయ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెరిగి, ల‌క్ష్మీక‌టాక్షం క‌లుగుతుంద‌నేది న‌మ్మ‌కం. ఇంట్లో ఉప‌యోగించే వ‌స్తువుల్లో చీపురు కూడా ఒక‌టి. ఇంటిని శుభ్రం చేసే చీపురును హిందూ మ‌తంలో అత్యంత ప‌విత్రంగా భావిస్తారు. సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపంగా చీపురును భావిస్తూ ఉంటారు. కాబ‌ట్టి చీపురును ఇంట్లో సరైన ప్రదేశంలో పెట్టడం వల్ల కూడా మీపై లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుంది. చాలా మంది చీపురును ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం అశుభాలు క‌లుగుతాయ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. మరి చీపురును ఏ దిశ‌లో ఉంచాలి? ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చీపురును ఏ దిశ‌లో ఉంచితే మంచిది..?

చీపురును ఇంటికి పడమర దిశలో ఉంచడం వల్ల చాలా మంచిది. వాస్తు ప్రకారం.. పడమర దిక్కు శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి పడమర దిక్కులో చీపురును పెడితే.. ఆర్థికంగా బలపడతారు.

చీపురును నిలువుగా ఉంచొచ్చా..?

చాలా మంది చీపురును నిలువుగా పెడుతూ ఉంటారు. ఇలా అస్సలు పెట్టకూడదట. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ దేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. కాబ‌ట్టి చీపురుని నిలబెట్టకుండా పడుకోబెట్టండి. మంచం కింద చీపురు అస్సలు ఉంచకూడదు.

చీపురును పొర‌పాటును కూడా తొక్క‌కూడ‌దు..

చీపురును లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. ఇందులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే చీపురును పొరపాటున కూడా తొక్కకూడదని అంటారు. ఒకవేళ తొక్కినా విసిరినా లక్ష్మీ దేవిని అవమానించినట్టే అవుతుంది. కాబట్టి చీపురు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎవరికీ కనిపించని ప్రదేశంలో ఉంచాలి

చాలా మంది చీపుర్లను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. ఇల్లు ఊడ్చిన తర్వాత చీపుర్లను ఎవరికీ కనిపించని ప్రదేశంలో పెట్టాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చీపుర్లను అందరికీ కనిపించే ప్రదేశంలో పెడితే.. పాజిటివ్ ఎనర్జీ తగ్గి.. నెగిటీవ్ ఎనర్జీ పెరుగుతుంది. అదే విధంగా విరిగిపోయిన చీపురును ఇంట్లో ఉంచకూడదు.

Latest News