TSRTC Recruitment 2025 : ఆర్టీసీలో 1743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆర్టీసీలో 1743 పోస్టుల భర్తీకి టీఎస్‌ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల. అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

TSRTC Job Notification

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విధాత): నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న మొత్తం 1743 పోస్టులకు తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా ఉద్యోగాలను నియమించడానికి నోటిఫికేషన్ వెలువడించింది. ఇందులో 1000 డ్రైవర్ ,743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి . అక్టోబర్ 8 నుండి 28 వరకు https://www.tgprb.in/ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉద్యోగార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.