Akhanda 2 postpone: ఆర్థిక సమస్యలతోనే..‘అఖండ 2’ వాయిదా: నిర్మాత సురేశ్ బాబు

బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ సినిమా విడుదల వాయిదాపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు స్పందిస్తూ, ఆర్థిక సమస్యలే కారణమని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు.

Akhanda 2 postpone: ఆర్థిక సమస్యలతోనే..‘అఖండ 2’ వాయిదా: నిర్మాత సురేశ్ బాబు

విధాత: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రూపొందిన ‘అఖండ 2’: తాండవం సినిమా విడుదల చివరి నిమిషాల్లో వాయిదా పడటంపై రకరకాల రచ్చ సాగుతుంది. ఈ సినిమా వాయిదాపై ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. అఖండ 2 మూవీ విడుదల వాయిదాకు కేవలం ఆర్థిక పరమైన సమస్యలే కారణమని తేల్చేశారు. సినిమా విడుదలపై పలు రకాల వార్తలు వెలువడటం పట్ల సురేష్ బాబు అసహనం వెలిబుచ్చారు ఫైనాన్షియల్ సమస్యల కారణంగానే సినిమా విడుదల వాయిదా పడిందని..త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని..అందుకు చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తానుకూడా ఈ రోజు సంబంధిత ఫైనాన్షియల్ చర్చలలో పాల్గొన్నానని తెలిపారు.

శ్రీనందు హీరోగా నటిస్తున్న ‘సైక్‌ సిద్ధార్థ’ సాంగ్‌ లాంఛ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సురేశ్‌ బాబు.. ‘అఖండ 2’ వాయిదా సమస్యపై స్పందించారు. ఆఖండ 2 సినిమాపై నెలకొన్న ఆర్థిక సమస్యలపై ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారని, ఆర్థికపరమైన ఇబ్బందులు బయటకు చెప్పలేకపోయినప్పటికి.. గతంలోనూ చాలా సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయన్నారు. నేను కూడా ఆఖండ 2 సినిమా సమస్య పరిష్కారం కోసం వెళ్లానని.. అందుకే ఈ కార్యక్రమానికి రావడం ఆలస్యమైందని తెలిపారు. డియన్స్ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, త్వరలోనే సమస్య పరిష్కారమై అఖండ 2 విడుదలవుతుందని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

ఫ్యాన్స్‌తో ఆటలొద్దు: బోయపాటి, నిర్మాతలకు బాలయ్య వార్నింగ్‌

అఖండ-2 మూవీ రిలీజ్‌ వాయిదాపై హీరో నందమూరి బాలకృష్ణ సీరియస్ అయ్యారు.
సినిమా వాయిదాపై కోపగించుకున్న బాలయ్య అసలేం జరిగిందంటూ.. దర్శకుడుబోయపాటి, 14రీల్స్ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వారిని ఇంటికి పిలిపించి చర్చించిన బాలయ్య ఆఖరి నిమిషంలో రిలీజ్‌ ఆగిపోవడం ఏంటని మండిపడ్డారు. ఫ్యాన్స్‌తో ఆటలొద్దని బోయపాటి, నిర్మాతలకు బాలయ్య వార్నింగ్‌ ఇచ్చినట్లుగా సమాచారం. సాయంత్రం కల్లా సినిమా రిలీజ్‌ అవ్వాలన్న బాలయ్య అల్టిమేటమ్ ఇచ్చారు. బాలయ్య దెబ్బకు వణికిపోయిన ప్రొడ్యూసర్లు ఆర్థికపరమైన సవాళ్లను పరిష్కరించుకునేందుకు సీరియస్ గా ప్రయత్నాల్లో మునిగిపోయారు. 14 రీల్స్ నిర్మాతలకు సాయపడేందుకు కొందరు అగ్ర నిర్మాతలు కూడా ముందుకొచ్చినట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి :

UAE Celebrates 54th National Day : సూపర్ థ్రిల్లింగ్…యుఏఈ 54వ జాతీయ దినోత్సవం
Bigg Boss 9 | బిగ్ బాస్ ప్రియుల‌కి షాక్ ఇచ్చిన స్టార్ మా.. సీజ‌న్ చివ‌ర‌లో ఇలా చేశారేంటి?