Akira Nandan| పార్కింగ్ ఏరియా నుండి ప్రభాస్ మూవీ చూసేందుకు థియేటర్‌లోకి వెళ్లిన అకీరా..!
Akira Nandan| పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్‌ల ముద్దుల తనయుడు అకీరా నందన్ ఇటీవల తెగ వార్తలలో నిలుస్తున్నాడు. ఒకప్పుడు బయట కనిపించని అకీరా ఈ మధ్య మాత్రం నిత్యం కెమెరాలకి చిక్కుతున్నాడు. పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుండి తన తండ్రి వెంటే ఉంటూ అందరి దృష్టిని ఆ
Akira Nandan| పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్‌ల ముద్దుల తనయుడు అకీరా నందన్ ఇటీవల తెగ వార్తలలో నిలుస్తున్నాడు. ఒకప్పుడు బయట కనిపించని అకీరా ఈ మధ్య మాత్రం నిత్యం కెమెరాలకి చిక్కుతున్నాడు. పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుండి తన తండ్రి వెంటే ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు అకీరా ఉన్నాడు. అలానే మోదీతో భేటికి పవన్ వెళ్లినప్పుడు అప్పుడు కూడా పవన్ తోనే ఉన్నాడు అకీరా. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంకి పంచెకట్టులో హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఇలా ప్రతిసారి అకీరా తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ప్రభాస్ కల్కి మూవీ చూసేందుకు వచ్చాడు

కల్కి టీషర్ట్ ధరించి ప్రభాస్ మూవీ కల్కి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు వెళ్లాడు. అక్కడ ఫ్యాన్స్ తాకిడి ఎక్కువ ఉండడంతో ప్రధాన ద్వారం నుండి కాకుండా పార్కింగ్ ఏరియాలో ఉన్న లిఫ్ట్ ద్వారా థియేటర్‌లోకి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా కల్కి టీషర్ట్ వేసుకొని అకీరా థియేటర్‌కి వెళ్లడం ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా చూడముచ్చటగా అనిపించింది. ఇప్పుడు అకీరాకి సంబంధించిన వీడియోని అయితే తెగ వైరల్ చేస్తున్నారు. ఇక అకీరా కూడా త్వరలో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడని ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే ఆయన పలు విభాగాలలో శిక్షణ తీసుకుంటున్నారు. మరో రెండు మూడేళ్లలో హీరోగా అకీరా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని కొందరు జోస్యాలు చెబుతున్నారు.
మరోవైపు ఈ మధ్య కాలంలో అకీరా హైట్ కూడా చర్చనీయాంశం అయింది. ప్రధాని మోదీ ని అకీరా నందన్ కలిసినప్పుడు మోదీ ఏమన్నారన్న విషయం కూడా నెటిజన్లకు రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు. అకీరా హైట్ చూసిన మోదీ… ఇంత హైట్ ఉన్నావు బాస్కెట్ బాల్ ఎందుకు ఆడటం లేదని అడిగారని రేణు దేశాయ్ చెప్పారు. మోదీ అలా అనగానే.. అకీరా ఏం మాట్లాడకుండా సిగ్గుతో తలదించుకున్నాడట. అకీరా నందన్ హైట్ పెరగానికి కాంప్లెన్ ఎన్నిసార్లు ఇచ్చారంటూ కొందరు కొంటె ప్రశ్నలు వేస్తుంటారు. అయితే దానికి రేణు దేశాయ్ సమాధానం ఇచ్చారు. అసలు అకీరా కాంప్లెన్ తాగలేదని ఆమె చెప్పుకొచ్చారు. అకీరా ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తింటాడని, ఇద్దరు తల్లిదండ్రుల నుంచి వచ్చిన జెనెటిక్స్ అంత హైట్ రావడానికి ఉపయోగపడ్డాయని పేర్కొంది రేణూ దేశాయ్.
Akira kuda manode Rebels 🔥🔥
Kalki Tshirt 💥#Blockbusterkalki #Kalki2898AD #Prabhas pic.twitter.com/ttxTXOo8hR
— Roaring REBELS (@RoaringRebels_) June 27, 2024
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram