మంగ్లీ కేసులో ప్రచారంపై కోర్టు కీలక ఆదేశాలు

మైక్రోఫైనాన్స్ కేసులో తనపై అసత్య ప్రచారం జరుగుతోందంటూ కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీకి ఊరట లభించింది. సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మంగ్లీ కేసులో ప్రచారంపై కోర్టు కీలక ఆదేశాలు

మైక్రోఫైనాన్స్ చీటింగ్ కేసులో కోర్టు మెట్లెక్కిన సింగర్ మంగ్లీకి ఊరట దక్కింది. తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. తన పరువుకి నష్టం కలిగించే విధంగా ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తు ప్రణాళికలతో కొందరు వ్యక్తులు తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారని మంగ్లీ పేర్కొంది. సోషల్ మీడియాలో ఆయా లింకుల్ని తొలగించాలని, తనపై అసత్య ప్రచారం చేయకుండా నిరోధించాలని మంగ్లీ కోర్టును అభ్యర్థించింది.

ఈ పిటిషన్‌ను విచారించన కోర్టు… మంగ్లీపై ఎలాంటి ప్రచారాలు చేయొద్దని ఆదేశించింది. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని స్పష్టం చేసింది. పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్స్ తో పాటు రమావత్ మధు, సుబ్బారావులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి :

మహిళా స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్
Peddi | ‘పెద్ది’పై భారీ అంచనాలు.. కానీ ప్రమోషన్స్‌లో వెనుకబడిన టీమ్, ఫ్యాన్స్ ఆవేదన