Tripti Dimri | దక్షిణాది సినిమాపైనే త్రిప్తి డిమ్రి ఫోకస్.. ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల్లోనూ ఛాన్స్ కొట్టేసిన హాట్‌బ్యూటీ..!
Tripti Dimri | త్రిప్తి డిమ్రి (Tripti Dimri) సందీప్ వంగా (Sandeep Reddy Vanga) డైరెక్టర్‌లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ మూవీలో అమ్మడి అందచందాలకు కుర్రకారు ఫిదా అయ్యింది. ఇటీవల ‘బ్యాడ్‌న్యూస్’తో అభిమానుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద హిట్‌ని సొంతం చేసుకున్నది.
Tripti Dimri | త్రిప్తి డిమ్రి (Tripti Dimri) సందీప్ వంగా (Sandeep Reddy Vanga) డైరెక్టర్‌లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ మూవీలో అమ్మడి అందచందాలకు కుర్రకారు ఫిదా అయ్యింది. ఇటీవల ‘బ్యాడ్‌న్యూస్’తో అభిమానుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద హిట్‌ని సొంతం చేసుకున్నది. ఈ సినిమా రూ.100కోట్లుపైగానే కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రస్తుతం సందీప్ వంగా, ప్రభాస్ కాంబినేషన్‌లో రానున్న స్పిరిట్‌లోనూ త్రిప్తి నటించబోతున్నది. అలాగే, యానిమల్ పార్క్‌లోనూ కనిపించనున్నది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్. వాస్తవానికి త్రిప్తి డిమ్రి 2017లో శ్రీదేవి లీడ్ రోల్‌లో నటించిన ‘మామ్’ మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత సన్నిదేవోల్, బాబీ దేవోల్ ‘పోస్టర్ బాయ్’తో హీరోయిన్‌గా నటించింది.
ఆ తర్వాత రొమాంటిక్ డ్రామా ‘లైలా మజ్ను’తో మంచి గుర్తింపును తెచ్చుకున్నది. ఆ తర్వాత బుల్ బుల్, ఖాలా సినిమాల్లో నటించింది. 2021లో ఫోర్బ్స్ అండర్ 30 లిస్ట్‌లోనూ పేరు సంపాదించుకున్నది. త్రిప్తి సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్. 1994 ఫిబ్రవరి 23న పౌరీ గర్వాల్‌లో జన్మించింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నది. ఇంగ్లీష్ హానర్స్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక పుణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నది. గతేడాది సందీప్ వంగా, రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ మూవీలో అవకాశం దక్కించుకున్నది. రణబీర్ కపూర్‌తో రొమాన్స్ చేస్తూ ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఈ బ్యూట సౌత్ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ప్రభాస్ ‘సలార్-2’ మూవీతో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే మూవీలోనూ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే అమ్మడు సౌత్ సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకునే అవకాశాలు లేకపోలేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram