Kiran Abbavaram|హీరో కిరణ్ అబ్బవరం ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు షేర్ చేసిన రహస్య గోరఖ్
Kiran Abbavaram| యంగ్ హీరోలు వరసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇక హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కిరణ్, రహస్య ఇద్దరూ కలిసి రాజావారు రాణిగారు సినిమాలో నటించారు. ఈ సినిమా సెట్స్ లో ఇద్దరి మధ్య
Kiran Abbavaram| యంగ్ హీరోలు వరసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇక హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కిరణ్, రహస్య ఇద్దరూ కలిసి రాజావారు రాణిగారు సినిమాలో నటించారు. ఈ సినిమా సెట్స్ లో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరి ఆ తర్వాత ప్రేమలో పడి ఐదేళ్లు ప్రేమించుకొని మార్చ్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అందరు ఎదురు చూస్తున్న క్రమంలో డేట్ వచ్చేసింది. గురువారం (ఆగస్టు 22) కర్ణాటకలోని కూర్గ్ లో కిరణ్, రహస్యల వివాహం జరగనుంది. ఇప్పటికే వధూ వరులతో పాటు పెళ్లి బృందం కూడా అక్కడకు చేరుకుంది.

అయితే వివాహానికి ముందు జరిగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో వధూవరులిద్దరూ తెగ సంతోషంగా గడుపుతున్నారు. పెళ్లికి సంబంధించిన హంగామా జోరుగానే సాగుతుంది. ఈ క్రమంలో కాబోయే పెళ్లి కూతురు రహస్య కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమెతో పాటు కాబోయే వరుడు హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి దుస్తుల్లో మురిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు ముందుగానే అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించి.. రాజా వారు రాణి వారు చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. తొలిచిత్రం సక్సెస్‌ను అందుకున్న ఆ తరువాత ఎస్‌ఆర్ కల్యాణ్ మండపం అనే మోస్తరు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యువ నటుడు. ఇక ఆ తరువాత ఈ హీరో నటించిన సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యం విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ ఇలా అరడజనుకు పైగా డిజాస్టర్‌లను కైవసం చేసుకున్నాడు. కిరణ్ అబ్బవరం ‘క’ అంటూ ప్రేక్షకులను పలకరిచండానికి సిద్దమవుతున్నాడు. పీరియాడిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సిద్దమవుతున్నాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram