కోట శ్రీనివాసరావు భార్య కన్నుమూత
దివంగత నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం నెలకొంది. ఆయన సతిమణి రుక్మిణి అనారోగ్యంతో ఆదవారం రాత్రి మృతిచెందారు. ఆమె అంత్యక్రియలు సోమవారం మహా ప్రాస్థానంలో పూర్తయ్యాయి. కొన్ని రోజుల కింద వృద్ధాప్య సమస్యలతో కన్నుమూయగా.. ఇప్పుడు ఆయన సతీమణి కూడా కాలం చేశారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విలక్షణ నటుడు కోట జూలై 13న కన్నుమూశారు. ఆయన భార్య రుక్మిణి.. ఆమె తల్లి మరణంతో మెంటల్లీ డిస్టర్భ్ అయ్యారు. ఆ తర్వాత 30 ఏళ్ల వరకూ ఆమె ఎమరినీ గుర్తు పట్టలేదు. ఈ విషయాన్ని తన స్నేహితుల వద్ద చెప్పుకుని కోట బాధపడేవారు. అయితే, ఇటీవలే కోట మరణించగా.. అది మరువక ముందే నెల రోజుల్లోపే ఆయన భార్య కన్నుమూయడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram