Allu Arjun | ముంబైలో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్న‌ అల్లు అర్జున్ .. జుహూలో లగ్జరీ అపార్ట్మెంట్, నెలకు రెంట్ ఎంతో తెలుసా?

Allu Arjun |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడన్న వార్తలు ఇటీవల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వార్తలను నిర్మాత అల్లు అరవింద్ కూడా ధృవీకరించడంతో ఇప్పుడు ఈ విషయం మరింత చర్చనీయాంశమైంది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 24, 2026 11:09 AM IST
Allu Arjun | ముంబైలో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్న‌ అల్లు అర్జున్ .. జుహూలో లగ్జరీ అపార్ట్మెంట్, నెలకు రెంట్ ఎంతో తెలుసా?

Allu Arjun |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడన్న వార్తలు ఇటీవల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వార్తలను నిర్మాత అల్లు అరవింద్ కూడా ధృవీకరించడంతో ఇప్పుడు ఈ విషయం మరింత చర్చనీయాంశమైంది. అయితే ఈ షిఫ్టింగ్ సుమారు మూడు సంవత్సరాలపాటు మాత్రమే. సినిమా షూటింగ్స్ కోస‌మే బ‌న్నీ మూడేళ్ల పాటు అల్లు అర్జున్ ముంబైలో నివసించనున్నట్లు సమాచారం.

బాలీవుడ్ సెలబ్రిటీలకు హబ్‌గా పేరొందిన జుహూ ప్రాంతాన్ని బన్నీ తన నివాసంగా ఎంచుకున్నాడు. ఇప్పటికే అక్కడ సముద్రం ఎదురుగా ఉన్న ఒక విలాసవంతమైన 5BHK అపార్ట్మెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అపార్ట్మెంట్ కోసం అల్లు అర్జున్ నెలకు ఏకంగా రూ.16 లక్షల అద్దె చెల్లిస్తున్నాడన్న సమాచారం బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ముంబైలోని జుహూ వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఈ స్థాయి అద్దెలు సాధారణమేనని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటీనటులు, వ్యాపారవేత్తలు నివసించే ఈ ప్రాంతంలో లగ్జరీ అపార్ట్మెంట్లకు భారీ డిమాండ్ ఉంటుంది.ఇక అల్లు అర్జున్ ముంబైకి మారడానికి ప్రధాన కారణం ఆయన ఎంపిక చేసుకున్న‌ ప్రాజెక్టులేనని తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ‘రాకా’ సినిమా చేస్తున్న బన్నీ, ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం ముంబైలోనే జరగనుంది. అలాగే లోకేష్ కనగరాజ్‌తో చేయనున్న తదుపరి ప్రాజెక్ట్ కూడా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఉండే అవకాశముంది.

పాన్ ఇండియా స్టార్‌గా ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్‌పై మరింత దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబైలో నివాసం ఏర్పరచుకోవడం ద్వారా అక్కడి సినిమా పరిశ్రమతో మరింత దగ్గరగా ఉండాలని, తన మార్కెట్‌ను విస్తరించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తానికి మూడు సంవత్సరాలపాటు ముంబైలో మకాం వేసే బన్నీ, తన కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్లాలని చూస్తున్నాడు. అయితే ఈ గడువు పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్‌కి వస్తాడా? లేక బాలీవుడ్‌లో స్థిరపడతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.