Asha Bhosle | లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మూగబోయిన సంగీత ప్రపంచం
Asha Bhosle | భారతీయ సంగీత ప్రపంచానికి అపారమైన సేవలు అందించిన లెజెండరీ గాయని ఆశా భోస్లే అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన కొద్ది నిమిషాలలోనే కన్నుమూసారు. శనివారం (ఏప్రిల్ 11) ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆశా భోస్లే కన్నుమూసింది. ఈ విషాద వార్త తెలుసుకున్న సంగీత ప్రముఖులు, అభిమానులు ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు.

గుండె సంబంధిత సమస్యలు అలాగే తీవ్రమైన అలసటతో పాటు ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఆసుపత్రిలో ఆశా భోస్లే చేరిన తర్వాత ఆమె మనవరాలు జనై భోస్లే సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు. “మా అమ్మమ్మగారు తీవ్ర అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఆమె త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీని గౌరవించండి” అని ఆమె పేర్కొన్నారు.
కాగా, భారతరత్న లతా మంగేష్కర్ సోదరిగా కూడా ప్రసిద్ధి చెందిన ఆశా భోస్లే.. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో సంగీత ప్రియులను అలరించారు. హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి అపారమైన ఖ్యాతిని సంపాదించారు. తెలుగులోనూ ఆమె పలువురు గుర్తుండిపోయే పాటలు ఆలపించారు.
గత కొన్నేళ్లుగా వయోభారంతో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఆమె, అప్పుడప్పుడు సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులను అలరించారు. ఆమె కన్నుమూసారన్న వార్త బయటకు రావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రముఖులు షాక్‌లో ఉండిపోయారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram