Tollywood | టాలీవుడ్‌లో పెళ్లి సంద‌డి.. రేపు యువ హీరో నిశ్చితార్థం.. ఏప్రిల్ 29న పెళ్లి

Tollywood | టాలీవుడ్‌లో పెళ్లి సందడి కొనసాగుతున్న వేళ, మరో యంగ్ హీరో కూడా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఇటీవలి కాలంలో వరుస ఫ్లాప్స్ తర్వాత మళ్లీ హిట్స్‌తో ఫామ్‌లోకి వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నాడు.

  • By: Sandeep |    movies |    Published on : Apr 04, 2026 9:51 AM IST
Tollywood | టాలీవుడ్‌లో పెళ్లి సంద‌డి.. రేపు యువ హీరో నిశ్చితార్థం.. ఏప్రిల్ 29న పెళ్లి

Tollywood | టాలీవుడ్‌లో పెళ్లి సందడి కొనసాగుతున్న వేళ, మరో యంగ్ హీరో కూడా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఇటీవలి కాలంలో వరుస ఫ్లాప్స్ తర్వాత మళ్లీ హిట్స్‌తో ఫామ్‌లోకి వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నాడు.మార్చి 8న కావ్య రెడ్డి అనే యువతితో రోకా వేడుకను కుటుంబ సభ్యుల మధ్య సాదాసీదాగా జరుపుకున్న శ్రీనివాస్… ఇప్పుడు అధికారికంగా నిశ్చితార్థం, వివాహ తేదీలను ఫిక్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఈ జంట నిశ్చితార్థం ఏప్రిల్ 5న హైదరాబాద్లో జరగనుంది.

తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణంలో పెళ్లి

నిశ్చితార్థం అనంతరం వివాహం ఏప్రిల్ 29న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం సన్నిధిలో జరగనుంది. ఈ వేడుకను అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యుల మధ్యే ఆధ్యాత్మికంగా నిర్వహించనున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

వివాహం తర్వాత మే నెలలో హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే ప్లాన్‌లో కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.

వధువు ఎవరు?

కావ్య రెడ్డి హైదరాబాద్‌కు చెందిన యువతి. సినీ రంగంతో సంబంధం లేకుండా న్యాయవాది కుటుంబానికి చెందినదిగా సమాచారం. ఆమె తండ్రి ప్రముఖ లాయర్ కాగా, వారి కుటుంబంలో చాలామంది న్యాయవాదులే ఉన్నారని తెలుస్తోంది.

కెరీర్‌లో మళ్లీ ట్రాక్‌లో శ్రీనివాస్

ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’, ‘కిష్కింధపురి’ సినిమాలతో మంచి విజయాలు అందుకుని తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘హైందవం’, ‘టైసన్ నాయుడు’ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో సినీ వర్గాలు, అభిమానులు ఈ కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొత్తం మీద, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి టాలీవుడ్‌లో మరో గ్రాండ్ సెలబ్రేషన్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.