Bigg Boss 9 | బిగ్ బాస్‌లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్.. డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఉంటుందా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఎలిమినేషన్ ప్రేక్షకులకు భారీ షాక్ ఇవ్వనుందని ఇదివరకే ప్రచారం జరిగింది. సాధారణంగా ఆదివారం ప్రసారం చేసే ఎపిసోడ్ ముందుగానే షూట్ అవుతుందనే విషయం తెలిసిందే
Bigg Boss 9 | బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఎలిమినేషన్ ప్రేక్షకులకు భారీ షాక్ ఇవ్వనుందని ఇదివరకే ప్రచారం జరిగింది. సాధారణంగా ఆదివారం ప్రసారం చేసే ఎపిసోడ్ ముందుగానే షూట్ అవుతుందనే విషయం తెలిసిందే. అందుకే ఎలిమినేషన్‌కు సంబంధించిన వివరాలు ముందుగానే బయటకు వస్తాయి. ఈ వారం నామినేషన్స్‌లో హౌస్ నుంచి కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ తప్ప మిగతా హౌస్‌మేట్స్ అందరూ ఉన్నారు. భరణి, సుమన్ శెట్టి, సంజన, రీతు చౌదరి, డీమాన్ పవన్, తనూజ ఈ వారం నామినేట్ అయిన వారిలో ప్రధానులు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న విషయంలో సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వచ్చినా చివరికి షాకింగ్‌గా రీతు చౌదరి హౌస్ నుండి బయటకు వెళ్లినట్టు సమాచారం బయటకు వచ్చింది.
స్ట్రాంగ్ కంటెస్ట్ ఔట్..!
సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భావించిన రీతు, గత కొన్ని వారాల్లో ప్రేక్షకులని ఆకట్టుకున్నా, డీమాన్ పవన్‌తో ఆమె ఏర్పరచుకున్న క్లోస్ బాండ్ ఆమె గేమ్‌కి రెండో వైపు సమస్యగా మారిందని ప్రేక్షకుల అభిప్రాయం. ఒక దశలో ఆ ఫ్రెండ్‌షిప్ వల్ల రీతు ఫోకస్ ఆటపైనుండి తప్పుతున్నట్లు అనిపించింది. అదనంగా ఆమె ఇటీవల చేసిన సంచాలక్ నిర్ణయాల్లో కొన్ని తప్పులు రావడం కూడా ఓటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపిందని చెబుతున్నారు.బిగ్ బాస్ హౌస్‌లో ఎంత నటించాలనుకున్నా ఒక దశలో ప్రతి కంటెస్టెంట్ అసలు వ్యక్తిత్వం వెలుపలకొస్తుంది. రీతు – డీమాన్ పవన్ మధ్య స్నేహం నిజమైనదా లేదా గేమ్ స్ట్రాటజీ మాత్రమేనా అన్న అనుమానాలు ఆడియన్స్‌లో పెరిగాయి. అంతేకాదు వివాదాలు వచ్చినప్పుడు తన వైపే తప్పు ఉన్నా ఒప్పుకోకుండా వాదించడం ఆమెపై నెగటివిటీని పెంచింది. ఆ కారణంగా ఈ వారం నామినేట్ అయిన వారిలో లీస్ట్ ఓటింగ్‌లో రీతు మరియు సంజన ఉన్నారు. చివరికి అత్యల్ప ఓటింగ్ రీతు చౌదరికే రావడంతో ఆమె ఎలిమినేషన్ ఖరారైనట్టు తెలుస్తోంది.
సుమన్ శెట్టి, సంజన, రీతు ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ వారం వెళ్తారని అనుకున్నా, రీతు బయటికెళ్లడం మాత్రం అభిమానులకు పెద్ద షాక్‌గా మారింది. రీతు కూడా తన ఎలిమినేషన్‌ను ఊహించలేదని, మొత్తం టాస్కుల్లో తనవంతు పూర్తి కృషి పెట్టిందని భావించారని సమాచారం. అయినా ఆటలో వచ్చిన కొంత గందరగోళం, నిర్ణయాల్లో వచ్చిన తప్పులు, వాదించడం వంటి కారణాల వల్ల ప్రేక్షకుల మద్దతు తగ్గి చివరికి ఆమె హౌస్ నుండి బయటకు రావాల్సి వచ్చింది.దీనితో బిగ్ బాస్ సీజన్ 9లో 13వ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌గా రీతు చౌదరి ప్రయాణం ముగిసింది. మరోవైపు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram