South Movies | ఈ వారం థియేటర్లలో సౌత్ సినిమాల సందడి.. సూర్య, సమంత సినిమాలపై భారీ అంచనాలు!
South Movies | ఈ వారం సౌత్ ఇండియా సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు పలు భాషలకు చెందిన సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. యాక్షన్, థ్రిల్లర్, హారర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి విభిన్న జానర్లతో ప్రేక్షకులను అలరించేందుకు స్టార్ హీరోలు, యువ నటులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా సూర్య, సమంత నటించిన చిత్రాలపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
South Movies | ఈ వారం సౌత్ ఇండియా సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు పలు భాషలకు చెందిన సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. యాక్షన్, థ్రిల్లర్, హారర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి విభిన్న జానర్లతో ప్రేక్షకులను అలరించేందుకు స్టార్ హీరోలు, యువ నటులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా సూర్య, సమంత నటించిన చిత్రాలపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘వీరభద్రుడు’తో సూర్య మాస్ ఎంట్రీ
ఈ వారంలో ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో ‘వీరభద్రుడు’ ముందంజలో ఉంది. తమిళంలో తెరకెక్కిన ‘కరుప్పు’ చిత్రాన్ని తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. మే 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సూర్య సరసన త్రిష హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో మాస్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
మలయాళం నుంచి ‘అతిరది’
మలయాళ సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్న మరో చిత్రం ‘అతిరది’. ఇది యాక్షన్ కామెడీ జానర్‌లో తెరకెక్కింది. మే 14న విడుదల కానున్న ఈ సినిమాలో టొవినో థామస్, జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
హారర్ టచ్‌తో ‘వదలా’
తెలుగు ప్రేక్షకులను భయపెట్టేందుకు ‘వదలా’ సినిమా సిద్ధమవుతోంది. మే 14న విడుదల కానున్న ఈ హారర్ డ్రామాలో జగపతిబాబు, లయ, రితికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. మిస్టరీ, ఎమోషన్, హారర్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు సమాచారం.
సమంత నుంచి ‘మా ఇంటి బంగారం’
స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ కూడా ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. యాక్షన్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజూష కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
‘శివం శైవం: ది 1989 ఫైల్ కేస్’
హారర్ థ్రిల్లర్ అభిమానుల కోసం ‘శివం శైవం: ది 1989 ఫైల్ కేస్’ విడుదలకు సిద్ధమైంది. మే 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో అన్సు పొన్నచ్చన్, కట్టా జయంత్ కుమార్, వేములూరు రాజశేఖర్, దినేష్ కుమార్ కదంబాల ప్రధాన పాత్రల్లో నటించారు. 1989లో జరిగిన ఓ మిస్టీరియస్ కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
కన్నడ నుంచి ‘షేర్’
కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘షేర్’ అనే యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక అనాథ యువకుడు, ఓ గ్యాంగ్ మధ్య జరిగే ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. కిరణ్ రాజ్, శోభరాజ్, బాల రాజ్వాడి, వీణా సుందర్ ప్రధాన పాత్రల్లో నటించారు. మే 15న ఈ సినిమా విడుదల కానుంది.
రొమాంటిక్ కామెడీగా ‘లో నవీన్’
ఈ వారం విడుదలవుతున్న మరో కన్నడ చిత్రం ‘లో నవీన్’. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ సజ్జు, వర్ష గిరిధర్ జంటగా నటించారు. లవ్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలగలిపిన ఈ చిత్రం మే 15 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.
మొత్తానికి ఈ వారం సౌత్ ఇండస్ట్రీ నుంచి విభిన్న కథలతో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో థియేటర్లలో మంచి సందడి కనిపించనుంది. ముఖ్యంగా సూర్య ‘వీరభద్రుడు’, సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాలపై సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram