Mana Shankara Vara Prasad Garu | మ‌న శంక‌రవ‌ర‌ప్ర‌సాద్ గారు ట్రైల‌ర్‌కి టైం ఫిక్స్ చేశారా.. ఎప్పుడు, ఎక్క‌డ‌?

Mana Shankara Vara Prasad Garu | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేస్తోంది. కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • By: sn |    movies |    Published on : Jan 02, 2026 8:09 AM IST
Mana Shankara Vara Prasad Garu | మ‌న శంక‌రవ‌ర‌ప్ర‌సాద్ గారు ట్రైల‌ర్‌కి టైం ఫిక్స్ చేశారా.. ఎప్పుడు, ఎక్క‌డ‌?

Mana Shankara Vara Prasad Garu | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేస్తోంది. కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి క్రేజీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. మరోవైపు ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి టైమ్ దొరికిన‌ప్పుడ‌ల్లా మూవీపై ఏదో ఒక విధంగా బ‌జ్ క్రియేట్ చేస్తున్నారు.ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

తాజా సమాచారం ప్రకారం, ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను జనవరి 4న తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. తిరుపతి వేదికగా జరగనున్న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసే అవ‌కాశం ఉంది. మూవీలోని మీసాల పిల్ల సాంగ్‌కి ఎంత హైప్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతేకాదు, విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్‌లో కనిపించనుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.