Mokshagna | మోక్షజ్ఞ ఎంట్రీపై నందమూరి ఫ్యాన్స్‌లో భారీ హైప్ .. బాల‌య్య ఆ మాట చెప్ప‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Mokshagna | నందమూరి బాలకృష్ణ మరోసారి తన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఆదిత్య 369’ సీక్వెల్ , ‘ఆదిత్య 999 మ్యాక్స్’ త్వరలోనే ప్రారంభం కానుందని బాలయ్య వెల్లడించారు.

  • By: sn |    movies |    Published on : Nov 22, 2025 11:50 AM IST
Mokshagna | మోక్షజ్ఞ ఎంట్రీపై నందమూరి ఫ్యాన్స్‌లో భారీ హైప్ .. బాల‌య్య ఆ మాట చెప్ప‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Mokshagna | నందమూరి బాలకృష్ణ మరోసారి తన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఆదిత్య 369’ సీక్వెల్ , ‘ఆదిత్య 999 మ్యాక్స్’ త్వరలోనే ప్రారంభం కానుందని బాలయ్య వెల్లడించారు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు ఆయన కుమారుడు మోక్షజ్ఞ నందమూరి కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడని బలమైన సమాచారం రావడంతో ఫ్యాన్స్‌లో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.

మోక్షజ్ఞ తొలి సినిమా – గందరగోళానికి ఎండ్

మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి సంబంధించి గత కొన్నేళ్లుగా అనేక రూమర్స్ వచ్చాయి. ఇటీవల మోక్షజ్ఞ–ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో సినిమాకి సంబంధించి అనేక వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ అకస్మికంగా డ్రాప్ కావడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. దీంతో గోవా వేదికగా జరుగుతున్న 56వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకలో బాలకృష్ణ  స్వయంగా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ గురించి చెప్పడంతోపాటు ఇందులో తన కొడుకు మోక్షజ్ఞ తో నటిస్తానని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పై అందరికి ఆసక్తి పెరిగింది

సినిమా షూటింగ్ ఎప్పుడు?

ప్రాజెక్ట్‌ను బాలకృష్ణ కన్ఫర్మ్ చేసినప్పటికీ, షూటింగ్ ప్రారంభ తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం సినిమా 2026లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది సైన్స్ ఫిక్షన్–అడ్వెంచర్ కథ కావడంతో భారీ ప్రీ–ప్రొడక్షన్ అవసరం అవుతుంది. స్క్రీన్‌ప్లే, విజువల్ ఎఫెక్ట్స్, సెట్ డిజైన్ వంటి పనులు ఆగస్టు–సెప్టెంబర్ వరకు కొనసాగవచ్చని అంచనా.

మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?

నందమూరి అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ…‘ఆదిత్య 999 మ్యాక్స్’ వంటి భారీ కాన్సెప్ట్ సినిమాతో జ‌ర‌గ‌డం గొప్ప నిర్ణయమని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రం మోక్షజ్ఞకు పర్ఫెక్ట్ లాంచ్ అవుతుందని, బాలయ్య–మోక్షజ్ఞ కాంబినేషన్ స్క్రీన్‌పై అదరగొట్ట‌డం ఖాయ‌మ‌ని, సినిమా అభిమానులను మరింత ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైన మోక్షజ్ఞ డెబ్యూను ఈ సినిమాతోనే చూస్తామన్న నమ్మకంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. త్వరలోనే ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.