MSG Collections | సంక్రాంతి బాక్సాఫీస్‌కి మెగా జోష్ .. ‘మన శంకరవరప్రసాద్ గారు’తో చిరంజీవి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్

MSG Collections | సంక్రాంతి రేసులో దిగిన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రత్యేకంగా నిలుస్తోంది.

  • By: sn |    movies |    Published on : Jan 13, 2026 10:28 AM IST
MSG  Collections | సంక్రాంతి బాక్సాఫీస్‌కి మెగా జోష్ .. ‘మన శంకరవరప్రసాద్ గారు’తో చిరంజీవి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్

MSG Collections | సంక్రాంతి రేసులో దిగిన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన తొలిరోజే థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఊహించిన దానికంటే బెటర్‌గా నమోదయ్యాయి.

తొలి రోజు వసూళ్లలో దూకుడు

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, ఈ సినిమా భారతదేశంలో ఫస్ట్ డే రూ.37 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. ఇందులో ప్రీమియర్ షోల ద్వారా గణనీయమైన వసూళ్లు రాగా, సాధారణ షోలకూ మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ మూవీ మంచి స్టార్ట్ తీసుకుందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ప్రీమియర్లతోనే వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను టచ్ చేయడం విశేషంగా మారింది. టికెట్ బుకింగ్ యాప్‌లలోనూ సినిమాకు భారీ స్పందన కనిపించింది. రిలీజ్ డే ముందు, తర్వాత కలిపి లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడవ్వడం సినిమా క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. మొత్తం మీద వరల్డ్‌వైడ్ ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ భారీగానే ఉండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఫుల్ కనెక్ట్

చిరంజీవి కామెడీ టైమింగ్, వింటేజ్ ఎనర్జీ, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ నుంచి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా పండగ సీజన్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

స్టార్స్ ప్లస్ పాయింట్

ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు. సహాయక నటీనటులు కూడా కథకు బలంగా నిలిచారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోనూ ఆకట్టుకుంటోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.

కథా నేపథ్యం

కథ పరంగా చూస్తే, శంకరవరప్రసాద్ గారు అనే పాత్రలో చిరంజీవి ఒక కీలక భద్రతా అధికారిగా కనిపిస్తారు. విధి నిర్వహణలో బిజీగా ఉండే అతని జీవితం, కుటుంబానికి దూరమవుతుంది. పిల్లలు, భార్యతో విడిపోయిన పరిస్థితుల్లో ఆయన జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు, తిరిగి కుటుంబంతో కలిసే ప్రయత్నమే ఈ కథ సారాంశం. భావోద్వేగాలతో పాటు వినోదం సమపాళ్లలో ఉండటమే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

మొత్తంగా చూస్తే, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి సీజన్‌లో మెగాస్టార్ అభిమానులకే కాదు, సాధారణ ప్రేక్షకులకూ పండగ ట్రీట్‌గా మారిందని చెప్పాలి. రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.