Raja Saab | ‘రాజా సాబ్’ సాంగ్ లాంచ్‌లో హడావుడి.. ఫ్యాన్స్ గుంపులో నలిగిపోయిన నిధి అగర్వాల్
Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘రాజా సాబ్’ నుంచి రెండో పాటను తాజాగా హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని లులూ మాల్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు.
అయితే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న నిధి, ఇటీవల ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తాజాగా సాంగ్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె లులూ మాల్‌కు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. కానీ ఈ ఉత్సాహమే చివరకు ఆమెకు చేదు అనుభవంగా మారింది. ఈవెంట్ ముగిసిన అనంతరం నిధి అగర్వాల్ బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీలు, వీడియోల కోసం గుంపుగా చేరడంతో పరిస్థితి అదుపు తప్పింది. కొంతసేపు ఆమెకు ఊపిరాడనంతగా గందరగోళం నెలకొంది. దీంతో నిధి తీవ్ర అసహనానికి గురై, నిరుత్సాహంతో కారులోకి వెళ్లాల్సి వచ్చింది.
అక్కడే ఉన్న బాడీగార్డులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా కారులోకి ఎక్కించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సెలబ్రిటీల పట్ల కనీస అవగాహన, భద్రత పాటించాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ‘రాజా సాబ్’ విషయానికి వస్తే, సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే మరో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే అత్యంత గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అది నిజమైతే ప్రభాస్, చిరంజీవి ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే వేదికపై కనిపించే అరుదైన క్షణం ప్రేక్షకులకు దక్కనుంది. జనవరి 8న ప్రీమియర్స్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు వెల్లడించడంతో, ‘రాజా సాబ్’ విడుదల కోసం రెబల్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram