OTT Movies | డిసెంబర్ రెండో వారంలో సినిమాల హంగామా… థియేటర్లు,ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో సంద‌డే సంద‌డి

OTT Movies | ఇయర్ ఎండింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ విందు అందించేందుకు థియేటర్లూ, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లూ సిద్ధమయ్యాయి. డిసెంబర్ రెండో వారంలోనే ఏకంగా ఎనిమిది సినిమాలు విడుదల కానున్నాయి, అలాగే ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

  • By: sn |    movies |    Published on : Dec 09, 2025 8:00 AM IST
OTT Movies | డిసెంబర్ రెండో వారంలో సినిమాల హంగామా… థియేటర్లు,ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో సంద‌డే సంద‌డి

OTT Movies | ఇయర్ ఎండింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ విందు అందించేందుకు థియేటర్లూ, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లూ సిద్ధమయ్యాయి. డిసెంబర్ రెండో వారంలోనే ఏకంగా ఎనిమిది సినిమాలు విడుదల కానున్నాయి, అలాగే ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. యూత్ ఎంటర్టైనర్స్ నుంచి హారర్ థ్రిల్లర్స్, బయోపిక్స్ వరకూ ఈ జాబితాలో ఉండటంతో మూవీ లవర్స్‌కు ఈ వారం వినోద భరితంగా మారనుంది.

థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాలు

1. సుమ కొడుకు రోషన్ కనకాల ‘మోగ్లీ’ – డిసెంబర్ 12

యాంకర్ సుమ–రాజీవ్ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటించిన తొలి ప్రేమకథా చిత్రం ‘మోగ్లీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా కనిపిస్తారు. వైవా హర్ష ముఖ్య పాత్ర పోషించాడు. ప్రేమించిన అమ్మాయిని కాపాడుకునేందుకు ఓ యువకుడు చేసే పోరాటమే కథగా తెలుస్తోంది.

2. కార్తీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నగారు వస్తారు’ – డిసెంబర్ 12

తమిళ స్టార్ కార్తీ నటించిన ‘వా వాతియార్’ చిత్రం తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో రిలీజ్ కానుంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కార్తీ మరోసారి యాక్షన్-dose అందించనున్నాడు. హీరోయిన్ పాత్రకు ఆత్మలతో కమ్యూనికేట్ చేసే ప్రత్యేక షేడ్స్ ఉన్నట్లు సమాచారం.

3. హెబ్బా పటేల్ హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ – డిసెంబర్ 12

అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబ్బా పటేల్ ముఖ్యపాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ సినిమాను హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. విడుదల బాధ్యతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి తీసుకున్నారు. హార్ట్ పేషెంట్స్‌కి, ధైర్యం లేని వారికి ఈ మూవీ తగ్గదని బన్నీ వాస్ చెప్పడం ఆసక్తికరం.

4. లెజెండరీ సింగర్ ‘ఘంటసాల’ బయోపిక్ – డిసెంబర్ 12

తెలుగు సంగీత ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఘంటసాల గురించి రూపొందిన ఈ బయోపిక్‌ ఈ శుక్రవారం విడుదలవుతోంది. కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో నటించగా, మృదుల, సుమన్, సాయికిరణ్ కీలక పాత్రలు పోషించారు.

5. సందేశాత్మక చిత్రం ‘నా తెలుగోడు’ – డిసెంబర్ 12

హరినాథ్ పొలిచర్ల స్వీయ దర్శకత్వం–నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రఘుబాబు, జరీనా వహాబ్ వంటి నటులు నటించారు. సోషల్ మెసేజ్‌తో కూడిన ఈ మూవీ 12న థియేటర్లలోకి రానుంది.

6. సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్ టీరియస్’ – డిసెంబర్ 12

రోహిత్ సహాని, అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్ పుత్ నటించిన మిస్టరీ–థ్రిల్లర్ ‘మిస్ టీరియస్’ కూడా ఇదే తేదీన విడుదలవుతోంది.

7. యూత్ ఎంటర్టైనర్ ‘ఇట్స్ ఓకే గురు’ – డిసెంబర్ 12

సాయి చరణ్, ఉషశ్రీ జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ‘ఇట్స్ ఓకే గురు’ కూడా ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది.

ఓటీటీలో కూడా ఎంటర్టైన్మెంట్ వేవ్

థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా పలు ప్రాజెక్టులు వరుసగా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌ :

మ్యాన్‌ వర్సెస్‌ బేబీ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్

గుడ్‌బై జూన్‌ (మూవీ) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్

సింగిల్‌పాపా (హిందీ వెబ్‌సిరీస్) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్

వేక్‌ అప్‌ డెడ్‌ మ్యాన్‌ (మూవీ) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్

అమెజాన్‌ ప్రైమ్‌ :

మెర్వ్‌ (మూవీ) డిసెంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్

టెల్‌ మి సాఫ్టీ (మూవీ) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్

జియో హాట్‌స్టార్‌ :

సూపర్‌మ్యాన్‌ (మూవీ) డిసెంబరు 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్

ది గ్రేట్‌ షంషుద్దీన్‌ ఫ్యామిలీ (మూవీ) డిసెంబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్

ఆహా :

త్రీ రోజెస్‌ (తెలుగు సిరీస్) డిసెంబరు 12 వ తేదీ నుంచి స్ట్రీమింగ్

జీ5 :

సాలీ మొహబ్బత్‌ (మూవీ) డిసెంబరు 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్

మొత్తం మీద…

డిసెంబర్ రెండో వారంలో థియేటర్లలోనూ, ఓటీటీల్లోనూ ఎంటర్టైన్‌మెంట్‌కి కొద‌వే లేదు. అన్ని జోనర్ల సినిమాలు విడుదలవుతుండటంతో, మూవీ లవర్స్‌కు పండ‌గే అని చెప్పాలి.