Peddi | ‘పెద్ది’ టికెట్ బుకింగ్స్‌కు కౌంట్‌డౌన్.. ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే ప్రారంభం, తెలంగాణ‌లో?

Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ భారీ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుండగా, తాజాగా టికెట్ బుకింగ్స్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చింది.

Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ భారీ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుండగా, తాజాగా టికెట్ బుకింగ్స్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చింది.

సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త అందింది. ప్రముఖ టికెట్ బుకింగ్ వేదిక ప్రకటించిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ‘పెద్ది’ టికెట్లు నేటి మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో విడుదలకు ముందే టికెట్ల కోసం భారీ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.

తొలి షో చూసేందుకు ఆస‌క్తి..

ఇప్పటికే సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతుండగా, టికెట్ బుకింగ్స్ ప్రారంభం కావడం అభిమానుల్లో మరింత జోష్ నింపుతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు తొలి రోజు తొలి షో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే అనేక కేంద్రాల్లో టికెట్లు వేగంగా అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా టికెట్ బుకింగ్స్ త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే ప్రీమియర్ షోలు, ప్రత్యేక ప్రదర్శనల సమయాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆ వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

భారీ తారాగ‌ణం..

‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో ఆమె ‘అచ్చియమ్మ’ అనే విభిన్న పాత్రలో కనిపించనుంది. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

అలాగే కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, ప్రముఖ నటులు దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్నమైన పాత్రలతో ఈ తారాగణం సినిమాకు మరింత బలం చేకూర్చనుంది.

ఈ భారీ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు అందిస్తున్నాయి. సంగీత బాధ్యతలను ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ నిర్వహించడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

ఉత్తరాంధ్ర నేపథ్యంతో రూపొందిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ముఖ్యంగా గ్రామీణ వాతావరణం, భావోద్వేగాలు, క్రీడా అంశాల కలయిక సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతుందని చిత్రబృందం చెబుతోంది.

Latest News