Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అందం వెనుక ఉన్న‌ సీక్రెట్ ఇదే.. తల్లి మ‌ధు చోప్రా రివీల్!

Priyanka Chopra | మాజీ విశ్వసుందరి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. 40 ఏళ్ల వ‌య‌స్సు దాటిన‌ కూడా యవ్వనంతో మెరిసిపోతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 10, 2026 1:21 PM IST
Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అందం వెనుక ఉన్న‌ సీక్రెట్ ఇదే.. తల్లి మ‌ధు చోప్రా రివీల్!

Priyanka Chopra | మాజీ విశ్వసుందరి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. 40 ఏళ్ల వ‌య‌స్సు దాటిన‌ కూడా యవ్వనంతో మెరిసిపోతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఆమె అందం వెనుక సీక్రెట్ ఏంటి? ఎలాంటి బ్యూటీ టిప్స్ ఫాలో అవుతుందనే విషయంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈ సీక్రెట్‌ను ఆమె తల్లి, వైద్య నిపుణురాలు మ‌ధు చోప్రా బయటపెట్టారు.

మధు చోప్రా మాట్లాడుతూ.. నేను, నా కూతురు చాలా ఏళ్లుగా భారతీయ సంప్రదాయ చర్మ సంరక్షణ పద్ధతులను పాటిస్తున్నాం. ముఖ్యంగా శనగపిండి, పసుపుతో తయారు చేసే ఫేస్ ప్యాక్‌ను రెగ్యులర్‌గా ఉపయోగిస్తాం. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, కాంతివంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని తెలిపారు.

ఇది ఎంతో ఉప‌యోగ‌క‌రం..

ఈ ఫేస్ ప్యాక్‌లో ఉండే పసుపు చర్మానికి సహజ యాంటీ సెప్టిక్‌లా పనిచేస్తుందని, శనగపిండి చర్మంపై పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుందని చెప్పారు. అలాగే కొద్దిగా పాలు లేదా పెరుగు కలిపితే చర్మానికి తేమను అందించి, మృదుత్వాన్ని పెంచుతుందని వివరించారు. మొటిమలు, నలుపుదనం, నిర్జీవంగా కనిపించే చర్మ సమస్యలను తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

అయితే నేటి కాలంలో ఎక్కువగా రసాయనాలు కలిగిన క్రీములు వాడటం వల్ల చర్మం దెబ్బతింటుందని, అలాంటి సమస్యల నుంచి బయటపడటానికి ఈ సహజ పద్ధతులు చాలా మంచివని ఆమె సూచించారు.

ఫేస్ ప్యాక్ తయారీ విధానం:

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. కొద్దిగా పాలమీగడ లేదా పెరుగు కలపాలి. పావు చెంచా పసుపు, కొద్దిగా చల్లని పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. వారానికి రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరి చర్మ స్వభావం వేర్వేరుగా ఉండటంతో, వైద్యుల సలహా తీసుకుని ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రియాంక చోప్రా ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో హీరోగా మ‌హేష్ బాబు నటిస్తుండగా, ప్రియాంక ‘మందాకిని’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ‘వారణాసి’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.