Narayana Murthy | చిరంజీవిని కోలుకోలేని దెబ్బ కొట్టిన ఆర్‌.నారాయ‌ణ మూర్తి..ఎవ్వ‌రు ఊహించ‌లేదుగా..!

Narayana Murthy | 90వ దశకంలో చిరంజీవి టాలీవుడ్‌ను ఏలిన హీరో. నెంబర్ వన్ స్థానం ఆయనదే. ఏ సినిమా చేసినా బాక్సాఫీస్‌ దగ్గర సునామీలా వసూళ్లు చేసేది. ఆయన సినిమా వస్తే దానికి పోటీగా మరో హీరో సినిమా రిలీజ్ చేయడానికే ఎవరూ ముందుకు రాకపోయిన రోజులు అవి. అలాంటి సమయంలో మెగాస్టార్ దూకుడుకు అడ్డుకట్ట వేసిన సినిమా ఒక్కటుంది.

  • By: sn |    movies |    Published on : Nov 21, 2025 6:24 PM IST
Narayana Murthy | చిరంజీవిని కోలుకోలేని దెబ్బ కొట్టిన ఆర్‌.నారాయ‌ణ మూర్తి..ఎవ్వ‌రు ఊహించ‌లేదుగా..!

Narayana Murthy | 90వ దశకంలో చిరంజీవి టాలీవుడ్‌ను ఏలిన హీరో. నెంబర్ వన్ స్థానం ఆయనదే. ఏ సినిమా చేసినా బాక్సాఫీస్‌ దగ్గర సునామీలా వసూళ్లు చేసేది. ఆయన సినిమా వస్తే దానికి పోటీగా మరో హీరో సినిమా రిలీజ్ చేయడానికే ఎవరూ ముందుకు రాకపోయిన రోజులు అవి. అలాంటి సమయంలో మెగాస్టార్ దూకుడుకు అడ్డుకట్ట వేసిన సినిమా ఒక్కటుంది. అది స్టార్ హీరో సినిమా కాదు… విప్లవ సినిమా బ్రాండ్ ఆర్. నారాయణ మూర్తి నటించిన ‘ఒరేయ్ రిక్షా’.

ఒకే టైటిల్ థీమ్‌తో వచ్చిన రెండు సినిమాలు

1995లో రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద అరుదైన పోటికి దిగాయి. చిరంజీవి–కోడిరామకృష్ణ కాంబోలో వచ్చిన చిత్రం రిక్షావోడు భారీ అంచ‌నాల న‌డుమ‌ డిసెంబర్ 14, 1995న విడుదలైంది. ఈ సినిమా రిలీజ్‌కు కొద్దిరోజుల ముందు ఆర్. నారాయణ మూర్తి హీరోగా దాసరి నారాయణరావు నిర్మించిన ఒరేయ్ రిక్షా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇద్దరిదీ రిక్షా నేపథ్యంలో తెర‌కెక్కిన చిత్రం కావ‌డం, నెలరోజుల్లోపే రెండు సినిమాలు విడుదల కావడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఊహించింది ఒకటి… కానీ ఫలితం రివర్స్

అప్పటి పరిస్థితుల్లో చిరంజీవి సినిమా అంటే భారీ అంచనాలు ఉండేవి, భారీ వసూళ్లు రాబ‌ట్టేవి. అదే ఆర్. నారాయణ మూర్తి సినిమాలు కమర్షియల్ సినిమాలకు పోటీ ఇవ్వలేవ‌నే అభిప్రాయం ఉండేది. కానీ అప్పుడు మాత్రం ఒరేయ్ రిక్షా చిత్రానికి మాస్ ఆడియన్స్ నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.

ఒరేయ్ రిక్షా విజయం వెనుక కారణాలు

విప్లవ కథతో నారాయణ మూర్తి సెలెక్ట్ చేసిన సామాజిక సమస్యలు ప్రజల్లో సంక్షోభాన్ని రేకెత్తించాయి. వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం, పాటలు సెన్సేషన్ అయ్యాయి. రవళి హీరోయిన్‌గా నటించడం సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ కారణాల వల్ల ఒరేయ్ రిక్షా హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకెళ్లింది.

చిరంజీవి – నారాయణ మూర్తి మధ్య ఆసక్తికర సంబంధం

రిక్షావోడుకి కొద్దికాలంముందే చిరంజీవి నటించిన కోతల రాయుడు, ప్రాణం ఖరీదు సినిమాల్లో ఆర్. నారాయణ మూర్తి ముఖ్య పాత్రలు చేశారు.ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది.అయితే 1995లో వచ్చిన ఈ బాక్సాఫీస్ పోరు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. 1995లో జరిగిన ఈ పోటీ ఇప్పటికీ సినీ ప్రేమికులు గుర్తుంచుకునే ఘట్టంగా నిలిచిపోయింది.