Raj- Samantha | ఈ రోజే సమంత – రాజ్ నిడిమోరు వివాహం … శ్యామలీ పోస్ట్‌తో కొత్త చర్చలు
Raj- Samantha | టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దాదాపు పదిహేనేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న సామ్ ఇటీవలే హీరోయిన్‌గా 15 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది.
Raj- Samantha | టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దాదాపు పదిహేనేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న సామ్ ఇటీవలే హీరోయిన్‌గా 15 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరుసగా హిట్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
నాగ చైతన్య – సమంత విడాకుల తర్వాత కొత్త అధ్యాయం
‘ఏమాయ చేసావే’ చిత్ర షూటింగ్ సమయంలో హీరో అక్కినేని నాగ చైతన్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఆ తరువాత ఆయనను వివాహం చేసుకుంది. కానీ విభేదాల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం ఇద్దరూ తమ తమ జీవితాలను వేరువేరుగా కొనసాగిస్తున్నారు.విడాకుల తర్వాత నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సమంత మాత్రం రాజ్ & డీకే ద్వయంలోని దర్శకుడు రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉంటున్నట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కోయంబత్తూరులో వివాహం? – శ్యామలీ పోస్ట్‌తో ఊపందుకున్న వార్తలు
సమంత – రాజ్ నిడిమోరు కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో నేడు వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామలీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడంతో ఈ రూమర్స్‌కు మరింత బలమిచ్చింది. తెగించిన వ్యక్తులు అలాంటి పనులు చేస్తారు అన్న శ్యామలీ పోస్ట్ సమంత గురించే అని అందరు ముచ్చటించుకుంటున్నారు. ఇక ఈ జంట వివాహం ‘కన్ఫామ్’ అన్నట్టుగా సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. అయితే, అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.
సమంత కెరీర్ విషయానికి వస్తే, ‘ఏమాయా చేసావే’లో జెస్సీ పాత్రతోనే స్టార్‌డమ్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా హిట్‌లు అందుకుంటూ టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా నిలిచింది. ఇటీవలి కాలంలో మయోసిటిస్ వ్యాధితో బాధపడినా, తిరిగి కోలుకుంది. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి పెట్టిన ఆమె తిరిగి షూటింగ్‌లకు సిద్ధమవుతోంది.కెరీర్ ఆరంభంలో రూ. 40 లక్షలు పారితోషికంగా తీసుకున్న సమంత, ఇప్పుడు ఒక్క సినిమాకు రూ. 3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. త్వరలోనే ఆమె హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నదని సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram