Ravi Teja Mass Jathara OTT| ఓటీటీలోకి రవితేజ ‘మాస్‌ జాతర’

రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్‌ జాతర’ ఓటీటీ లోకి రాబోతుంది. ఈ సినిమా ఈ నెల 28వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ పోస్టర్‌ విడుదల చేసింది.

Ravi Teja Mass Jathara OTT| ఓటీటీలోకి రవితేజ ‘మాస్‌ జాతర’

విధాత : రవితేజ( Ravi Teja) హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్‌ జాతర’ (Mass Jathara) ఓటీటీ( OTT) లోకి రాబోతుంది. ఈ సినిమా ఈ నెల 28వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్(  Netflix )లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ పోస్టర్‌ విడుదల చేసింది. నవంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘మాస్‌ జాతర’ సినిమా మాస్‌ ఆడియన్స్‌తో పాటు రవితేజ అభిమానులను అలరించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

మూవీలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన పవర్ ఫుల్ నటనతో ఆకట్టుకోగా..శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్రలు ఇతర పాత్రాల్లో నటించారు. సినిమాలోని పాటలు, డ్యాన్స్ మాస్ ప్రేక్షకులను ఊపేశాయి.