Samantha | సమంతపై వివాదాస్పద కామెంట్స్.. తిట్టేవాళ్లు ఆ మూడు భాషలలో మాత్రమే తిట్టండి..
Samantha | స్టార్ నటి సమంతపై ఆమె మాజీ పర్సనల్ స్టైలిస్ట్ సాద్నా సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరును సమంత రెండోసారి వివాహం చేసుకున్న తర్వాత, సాద్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక స్టోరీ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
Samantha | స్టార్ నటి సమంతపై ఆమె మాజీ పర్సనల్ స్టైలిస్ట్ సాద్నా సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరును సమంత రెండోసారి వివాహం చేసుకున్న తర్వాత, సాద్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక స్టోరీ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. “బాధితురాలిగా విలన్‌గా బాగానే నటించింది” అంటూ రాసిన సాద్నా, ఏ వ్యక్తి పేరు ప్రస్తావించకపోయినా, ఆ కామెంట్ సమంతని ఉద్దేశించేనని నెటిజన్లు అనుమానించారు. దీంతో సమంత అభిమానులు సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
సమంత ఫ్యాన్స్ నుండి అసభ్య సందేశాలు?
సాద్నా సింగ్ కామెంట్స్ వైరల్ కావడంతో, ఆమె ఇన్‌బాక్స్‌లో సమంత అభిమానులు పెద్ద ఎత్తున అసభ్యకర సందేశాలు పంపుతున్నారు. అదే విషయంపై తాజాగా ఆమె స్పందించింది. “నన్ను తిడితే ఇంగ్లిష్, హిందీ లేదా భోజ్‌పురి లో మాత్రమే తిట్టండి. ఇతర భాషలు నాకు అర్థం కావు… మీ తిట్లు వృథా అవుతాయి” అంటూ సాద్నా మరో స్టోరీలో వ్యాఖ్యానించింది. ఆమె ఈ స్పందన సోషల్ మీడియాలో కొత్త దుమారాన్ని రేపింది.
సమంతపై రిగ్రెట్ లేనని స్పష్టత
తాజా వ్యాఖ్యలతో సాద్నా సింగ్, సమంతపై తాను చేసిన కామెంట్స్ పట్ల ఎలాంటి విచారం, ఫీలింగ్ లేదని స్పష్టం చేసినట్టే కనిపిస్తున్నది. దీంతో ఒకప్పుడు ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత లేదా వృత్తిపరమైన విభేదాల కారణంగానే సాద్నా.. సామ్ నుంచి దూరమై ఉండొచ్చన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
రాజ్–సమంత రెండో పెళ్లి – ఇండస్ట్రీలో హాట్ టాపిక్
ఇక సమంత, రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సమయంలో పరిచయం మొదలైన వీరిద్దరి బంధం ఇప్పుడు వివాహంతో ముగిసింది. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం విశేషం. ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సాద్నా సింగ్ చేసిన కామెంట్స్‌తో ఏర్పడిన ఈ కొత్త వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram