Senior Stars | జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న 60 ప్లస్ హీరోలు… బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సీనియర్ స్టార్స్!
Senior Stars | భారతీయ సినీ పరిశ్రమలో ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన హీరోలు క్రమంగా సినిమాలకు గుడ్‌బై చెప్పడం లేదా క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితమయ్యేవారు. కానీ ప్రస్తుత ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 60 ప్లస్ హీరోలే యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు.
Senior Stars | భారతీయ సినీ పరిశ్రమలో ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన హీరోలు క్రమంగా సినిమాలకు గుడ్‌బై చెప్పడం లేదా క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితమయ్యేవారు. కానీ ప్రస్తుత ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 60 ప్లస్ హీరోలే యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు.
టాలీవుడ్ నుంచి చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కోలీవుడ్ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ వరకు ఈ సీనియర్ స్టార్స్ అందరూ బాక్సాఫీస్ వద్ద తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. వయసు కేవలం అంకె మాత్రమేనని వారు తమ పనితీరుతో నిరూపిస్తున్నారు.
చిరు జోరు..
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత స్పీడ్ పెంచారు. ప్రస్తుతం విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్న ఆయన, అది పూర్తికాకముందే మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టడం విశేషం. యంగ్ డైరెక్టర్లతో కలిసి మాస్, కమర్షియల్ అంశాలతో సినిమాలు చేస్తూ తన వింటేజ్ స్టైల్‌ను మళ్లీ తెరపై చూపిస్తున్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ కూడా అదే జోరుతో ముందుకు సాగుతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి వంటి హిట్‌లతో మాస్ ప్రేక్షకుల్లో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్న బాలయ్య, ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు టెలివిజన్ షోలతోనూ బిజీగా ఉన్నారు.
రజనీ తగ్గడం లేదు..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ విషయానికి వస్తే, ఆయన వేగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జైలర్తో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆయన, ఇప్పుడు దాని సీక్వెల్‌పై దృష్టి సారించారు. 70 ఏళ్లు దాటినా ఆయనలోని స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పటికీ యంగ్ హీరోలకు సవాల్‌గా నిలుస్తోంది.
లోకనాయకుడు కమల్ హాసన్ మాత్రం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన ప్రస్థానాన్ని విస్తరించారు. భారీ ప్రాజెక్ట్స్‌తో పాటు కొత్త తరానికి అవకాశాలు కల్పిస్తూ, నటన, నిర్మాణం, ఇతర రంగాల్లోనూ సమతౌల్యం పాటిస్తున్నారు. విభిన్నమైన పాత్రలతో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ ఆయన సమానంగా మెప్పిస్తున్నారు.
ఇలా సీనియర్ హీరోలు తమ అనుభవం, క్రమశిక్షణతో పరిశ్రమకు బలంగా నిలుస్తున్నారు. వీరి సినిమాలు థియేటర్లకు ఊపిరి పోస్తూ, వేలాది మంది సినీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.
ప్రస్తుతం యంగ్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడానికే ఇబ్బంది పడుతున్న సమయంలో, 60 ప్లస్ హీరోలు చూపిస్తున్న ఈ జోరు నిజంగా ప్రేరణ కలిగించే విషయం. భవిష్యత్తు తరాలకు ఇది గొప్ప పాఠమనే చెప్పాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram