Akhanda 2 | చిన్న సినిమాలకు పెద్ద సమస్యగా మారిన అఖండ2 .. మోగ్లీ డైరెక్ట‌ర్ ఎమోష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్‌

Akhanda 2 | డిసెంబర్ 5న విడుదల కావాల్సిన నందమూరి బాలకృష్ణ చిత్రం ‘అఖండ 2’ చివరి నిమిషంలో వాయిదా పడటం తెలిసిన విషయమే. అయితే తాజా సమాచారం ప్రకారం నిర్మాతలు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్- Eros ఇంటర్నేషనల్ మధ్య సమస్యలు పరిష్కారం జ‌రిగి, సినిమా డిసెంబర్ 11న ప్రీమియర్స్, డిసెంబర్ 12న థియేటర్ల రిలీజ్ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • By: sn |    movies |    Published on : Dec 09, 2025 5:05 PM IST
Akhanda 2 | చిన్న సినిమాలకు పెద్ద సమస్యగా మారిన అఖండ2 .. మోగ్లీ డైరెక్ట‌ర్ ఎమోష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్‌

Akhanda 2 | డిసెంబర్ 5న విడుదల కావాల్సిన నందమూరి బాలకృష్ణ చిత్రం ‘అఖండ 2’ చివరి నిమిషంలో వాయిదా పడటం తెలిసిన విషయమే. అయితే తాజా సమాచారం ప్రకారం నిర్మాతలు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్- Eros ఇంటర్నేషనల్ మధ్య సమస్యలు పరిష్కారం జ‌రిగి, సినిమా డిసెంబర్ 11న ప్రీమియర్స్, డిసెంబర్ 12న థియేటర్ల రిలీజ్ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

చిన్న సినిమాలకు గట్టి దెబ్బ

డిసెంబర్ 12న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్న చిన్న సినిమాల‌పై ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. నందూ నటించిన ‘సైకో సిద్ధార్థ’, రోషన్ కనకాల హీరోగా వచ్చిన ‘మౌగ్లీ’, ‘ఈషా’ వంటి చిన్న సినిమాలు ఇప్పుడు భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే 12న ‘అఖండ 2’ విడుదల అయితే చిన్న సినిమాలకు స్క్రీన్‌లు దొరకడం కష్టం. డిసెంబర్ 18న ప్రదీప్ రంగనాథన్ ‘లైఫ్ ఇన్యూరెన్స్ కంపెనీ (LIK)’, డిసెంబర్ 19న జేమ్స్ కామరూన్ భారీ చిత్రం ‘అవతార్ 3’ రిలీజ్ కానుండటంతో చిన్న సినిమాలకు డిసెంబర్‌లో స్థలం ఉండే అవకాశం లేదు. దీంతో ‘మోగ్లీ’ను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వీక్ లేదా వాలెంటైన్స్ డే వీక్కి మార్చాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

‘మోగ్లీ’ వాయిదాపై దర్శకుడు సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘కలర్ ఫోటో’తో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ‘మోగ్లీ’ వాయిదాపై భావోద్వేగంగా స్పందిస్తూ.. “కలర్ ఫోటో, మౌగ్లీ సినిమాలకు నేను కాకుండా ఇంకొక డైరెక్టర్ ఉండి ఉంటే బాగుండేదేమో. రిలీజ్ విషయంలో దురదృష్టం వెంటాడుతోంది. బహుశా నేనే ఆ బ్యాడ్ లక్ కావచ్చు. ‘Directed by Sandeep Raj’ అని సిల్వర్ స్క్రీన్ మీద చూడడం నా కల… కానీ అది రోజురోజుకీ దూరమవుతోంది. సినిమా కోసం రోషన్ కనకాల, సరోజ్, సాక్షి, హర్ష, డీవీపీ మారుతి, భైరవ సహా మొత్తం టీమ్ ఎంతో కష్టపడ్డారని, అందరి కోసమైనా ‘మోగ్లీ’కి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ‘మెగ్లీ’కి పెద్దగా బజ్ లేకపోవడం, పాటలు కూడా పెద్దగా రీచ్ కావడంతో… వాయిదా టీమ్‌కు మేలు చేస్తుందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

డైరెక్టర్ సందీప్ రాజ్ పోస్ట్‌కు సాయిధరమ్ తేజ్, నిర్మాత ఎస్‌.కే.ఎన్ స్పందిస్తూ.. నీ కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది అని సపోర్ట్ చేశారు. మొత్తంగా… ‘అఖండ 2’ ప్రభావం చిన్న సినిమాలపై భారీగా పడనుంది. డిసెంబర్ 12న బాలయ్య సినిమా కచ్చితంగా విడుద‌లైతే , చిన్న సినిమాలు 2026కి వాయిదా పడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మేకర్స్ అధికారిక అనౌన్స్‌మెంట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.