Addham Mundhu Song : ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి రెండో సాంగ్ రేపే
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి రెండో పాట రేపు విడుదల కానుంది. రవితేజా, డింపుల్ హయతి పై చిత్రీకరించిన ఈ సాంగ్‌కి మంచి అంచనాలు నెలకొన్నాయి.
విధాత : రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాధ్ జంటగా నటిస్తున్న‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా నుంచి రెండో పాటను రేపు బుధవారం విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ పాటకు సంబంధించి ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేశారు. ‘అద్దం ముందు నిలబడి.. అబద్దం చెప్పలేనే.. నా అద్దం అంటే నువ్వే మరి.. ఈ నిజం దాచలేనే..’ అంటూ సాగిన ప్రోమో ఆకట్టుకుంది. రవితేజా, డింపుల్ హయతిపై సాగిన ఈ పాట మంచి క్యాచీ ట్యూన్స్ తో ఆకట్టుకునేలా సాగింది. డ్యూయెట్‌ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ కలిసి పాడారు. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘బెల్లా బెల్లా’ అనే పాటను రిలీజ్ చేశారు. రవితేజా, అషికా రంగనాథ్ పై చిత్రీకరించిన ఆ పాట కూడా మంచి వ్యూస్ సాధించింది.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అవుట్ ఆండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా డిజిటల్ , శాటిలైట్ బిజినెస్ కూడా పూర్తి అయ్యింది. జీ గ్రూప్ భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. జీ 5 ఈ చిత్రాన్ని ప్రసారం చేయనుంది.
ఇవి కూడా చదవండి :
Akhanda 2 | చిన్న సినిమాలకు పెద్ద సమస్యగా మారిన అఖండ2 .. మోగ్లీ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్
Bamboo Leaf Hand Crafts : చైనీస్ హ్యాండ్ క్రాఫ్ట్ వండర్..వెదురుతో అద్భుత కళాఖండాలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram