Mutton Curry | ఈ సండే మటన్ ఇలా ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
Mutton Curry | మటన్( Mutton ) అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. రేటు ఎక్కువైనా సరే వారానికి ఒకసారి అయినా తిని తీరాల్సిందే. మరి రెగ్యులర్ స్టైల్లో కాకుండా గ్రేవి వచ్చేలా పల్లెటూరి స్టైల్లో మటన్ కర్రీ( Village style Mutton Curry ) ట్రై చేసి చూడండి.. లొట్టలేసుకుంటూ తింటారు.

Mutton Curry | ఆదివారం( Sunday ) వచ్చిందంటే చాలు.. నాలుక నాన్ వెజ్( Non Veg ) వైపు గుంజుతుంది. మటనో( Mutton ), చికెనో( Chicken ), చేపలో( Fish ) లేదంటే కోడి గుడ్డు( Egg ) కూరైనా వండుకుంటారు. మొత్తానికి ఆదివారం నాడు ఏదో ఒక నాన్ వెజ్ వంటకం ఇంట్లో గుమగుమలాడాల్సిందే. కడుపు నిండా ఆరగించాల్సిందే. అయితే ఈ సండే మటన్ కూర( Mutton Curry ) వండుకునే వాళ్లు ఇలా ట్రై చేసి చూడండి.. లోట్టలేసుకుంటూ తింటారు.
మటన్ ఫ్రై కంటే గ్రేవితోనే తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. గ్రేవితో మటన్ టేస్ట్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఆహా ఏమి రుచి అనుకుంటూ ఆ రుచిని ఆస్వాదిస్తుంటారు. విలేజ్ స్టైల్‌లో మటన్ వండితేనే గ్రేవి వస్తుంది. మరి పల్లెటూరి స్టైల్లో మటన్ ఎలా వండాలో ఇవాళ తెలుసుకుందాం..
మటన్ కర్రీ కోసం కావాల్సినవి ఇవే..
మటన్ – 1 కిలో
ఉల్లిపాయలు – 2
ఉప్పు – రుచికి సరిపడా
కారం – తగినంత
పసుపు – అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్‌స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ – 1 టేబుల్‌స్పూన్
నూనె – అర కప్పు
ధనియాలు – 3 టేబుల్‌స్పూన్లు
సోంపు గింజలు – అర టీస్పూన్
జీలకర్ర – పావు టీస్పూన్
మిరియాలు – 1 టేబుల్‌స్పూన్
అనాస పువ్వు -1
దాల్చినచెక్క – కొద్దిగా
జాజికాయ ముక్క – చిటికెడు
యాలకులు – 8
నల్ల యాలకులు – 2
లవంగాలు – 5
తోక మిరియాలు – 5
మటన్ కర్రీ తయారీ విధానం ఇలా..
మొదటగా మటన్‌ను శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి.. ఒక పాత్రలో ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, అనాసపువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, జాజికాయ ముక్క, నల్ల యాలకులు, లవంగాలు, తోక మిరియాలు వేసి ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి. ఆ తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పదార్థాలు చల్లబడేలోపు ఒక టమాటాను కాల్చి తొక్క తీసి పక్కన ఉంచాలి. చల్లారిన మసాలా దినుసులను మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పొడి అయిన తర్వాత.. కాల్చిన టమాటా వేసి మళ్లీ మిక్సీ పట్టాలి. ఈ మెత్తని పేస్ట్‌లా ఒక గిన్నెలో వేసి రెడీగా ఉంచుకోవాలి.
కుక్కరల్‌లోకి నీటితో శుభ్రం చేసిన మటన్ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, నూనె వేసి బాగా కలపాలి. అనంతరం విజిల్ వచ్చేలా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. సిమ్‌లో మంట వెలిగించి సుమారు 3 విజిల్స్ వచ్చే వరకు అంటే 30 నిమిషాల పాటు ఉడికించాలి. కుక్కర్ మూత ఆవిరి పోయిన తర్వాత మూత తీసి మటన్‌ను ఓసారి కలిపితే ముక్కల్లోకి నీరు ఊరి మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న మటన్ కూరలోకి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలి. కాసేపు ఉడికించాలి.
ఇక మటన్ కర్రీకి మంచి ఫ్లేవర్ రావడం కోసం కలుపుకోవాల్సిన ముఖ్యమైన పదార్థాం నెయ్యి. ఒక టేబుల్‌స్పూన్ గేదె నెయ్యి వేసి కలిపి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరి స్టైల్ మటన్ కూర రెడీ. దీన్ని పులావ్,రాగి ముద్ద, జొన్న రొట్టెలతో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.