Anjeer Fruit | అంజీర్ పండ్లు మాంసాహారం అట..! శాఖాహారులారా జర జాగ్రత్త..!!
Anjeer Fruit | సహజసిద్ధంగా లభించే ప్రతి పండు( Fruit ) ఆరోగ్యానికి( Health ) ఎంతో మంచిది. ప్రతి పండులో కూడా పోషకాలు ఉంటాయి. చాలా పండ్లు చాలా వరకు అనేక రోగాలను కట్టడి చేస్తాయి. కొన్ని వ్యాధులు కలిగి ఉన్నవారు మాత్రం కొన్ని పండ్లకు దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే కొన్ని పండ్లు( Fruits ) వ్యాధులను తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది.

Anjeer Fruit | అయితే ఈ భూమ్మీద లభించే ప్రతి పండు( Fruit ) శాఖాహారమే( Vegetarian ) అని అందరికీ తెలుసు. కాబట్టి శాఖాహారంగా పరిగణించే పండ్లను ప్రతి ఒక్కరూ తింటారు. ఉపవాస సమయాల్లో పండ్లను అధికంగా తీసుకుంటుంటారు. పండ్లలో మాంసాహారం( Non Vegetarian ) పండ్లు కూడా ఉన్నాయంటే ముక్కున వేలేసుకోవచ్చు. కానీ ఒక్క పండు మాత్రం మాంసాహారమని నమ్ముతున్నారు. దానికి శాస్త్రీయ కారణం( Scientific Reason ) కూడా చెబుతున్నారు నిపుణులు. అందుకే ఆ పండు మాంసాహారమని విశ్వసిస్తున్నారు. మరి మాంసాహారంగా పిలువబడే పండు ఏదైనా ఉందా..? అంటే అది అంజీర్( Anjeer Fruit ) అని చెప్పొచ్చు. అంజీర్ పండు( Anjeer Fruit )ను మాంసాహారంగానే పరిగణించాలని కొందరు నిపుణులు చెబుతున్నారు.
మరి అంజీర్ పండును మాంసాహారంగా ఎందుకు పరిగణిస్తున్నారంటే.. ఆ పండులో జరిగే పరాగ సంపర్క( Polliation ) క్రియనే దానికి కారణమని విశ్లేషిస్తున్నారు. పరాగ సంపర్కం కోసం కందిరీగలు( Wasp ).. అంజీర్ పండ్లను ఆశ్రయిస్తాయి. అంజీర్ పండు కింది భాగంలో ఉండే చిన్న రంధ్రం ద్వారా ఆడ కందిరీగలు లోపలికి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత వాటి రెక్కలు విరిగిపోయి.. లోపలనే ఉండిపోతాయి. ఇక ఆడ కందిరీగలను మగ కందిరీగలు కూడా అనుసరిస్తాయి. ఆడ కందిరీగలు పెట్టిన గుడ్లతో మగ కందిరీగలు పరాగసంపర్కంలో పాల్గొంటాయి. ఫలదీకరణం( Fertilisation ) అనంతరం.. మగ కందిరీగలు చనిపోతాయి. దీంతో ఆడ, మగ కందిరీగలు కూడా అంజీర్ పండులోనే చనిపోతాయి. ఆ రెండింటి అవశేషాలు( Skeleton ) అంజీర్ పండులోనే ఉండిపోవడం కారణంగా దాన్ని మాంసాహారంగా పరిగణిస్తున్నారు. ఇక ఫలదీకరణం చెందిన తర్వాత ఆడ కందిరీగలు చిన్నవిగా ఉండడంతో చిన్న రంధ్రాల ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
ఈ నేపథ్యంలో అంజీర్ పండును శాఖాహారంగా చూడొద్దని, అది పక్కా మాంసాహారమేనని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. కందిరీగల అవశేషాలు అంజీర్ పండులోనే ఉండటం కారణంగా దాన్ని మాంసాహారంగానే చూడాలని స్పష్టం చేస్తున్నారు.
అంజీర్ పండ్ల వల్ల ఉపయోగాలివే..
ఇక అంజీర్ పండు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. అంజీరా పండ్లలో విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, ప్రోటీన్‌లు, కార్బోహైడ్రేడ్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను రోజూ తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. అంజీరా పండ్లను నీళ్లలో నానబెట్టుకుని తింటే మంచిది. ఉదయం నిద్ర లేచిన వెంటనే రాత్రి నానబెట్టుకున్న అంజీర పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అంతేగాక అంజీర పండ్లతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అంజీరా పండ్లు మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తాయి. మూలశంఖ వంటి వ్యాధులను నయం చేస్తాయి. మనం బరువు తగ్గడానికి, మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి కూడా అంజీర పండ్లు ఎంతో దోహదం చేస్తాయి. అంజీరా పండ్లు తినడం వల్ల బరువు అదుపులోకి వస్తుంది. అధిక రక్తపోటు తగ్గుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం అంజీరా పండ్లను తినవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు అంజీరా పండ్లను రోజూ తింటే షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. గుండె సంబంధిత వ్యాధులకు, నెలసరి సమస్యలకు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లకు కూడా అంజీరా పండ్లు మేలు చేస్తాయి.