Health Tips | భోజనం మధ్యలో నీళ్లు తాగుతున్నారా..? ‘షుగర్’ కొన్ని తెచ్చుకున్నట్టే..!
Health Tips | మీరు భోజనం( Meals ) మధ్య మధ్యలో నీళ్లు( Water ) గుటగుట తాగేస్తున్నారా..? అయితే ఈ అలవాటు( Habit )ను మానుకోండి.. లేదంటే జీర్ణ రసాలు( Digestive Enzymes ) పలుచగా మారి.. అనేక అనారోగ్య సమస్యలు( Health Issues ) ఏర్పడుతాయి. మరి ముఖ్యంగా షుగర్ వ్యాధి( Sugar Disease ) బారిన పడే ప్రమాదం ఉంది.

Health Tips | ఆరోగ్యం( Health )గా ఉండాలంటే కడుపు నిండా భోజనం( Meals ), కంటి నిండా నిద్ర( Sleep ) అవసరం. ఈ రెండు లేకపోతే జీవించడం కష్టమవుతుంది. అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన సమయానికి భోజనం చేయాలి.. కంటి నిండా నిద్రపోవాలి.
అయితే ప్రధానంగా భోజనం చేసే సమయంలో చాలా మంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఆ చిన్న పొరపాట్లే అనేక అనారోగ్య సమస్యలకు( Health Issues ) దారి తీస్తుంది. ఆ చిన్న పొరపాటు ఏంటంటే.. అల్పాహారం తినే సమయంలో కానీ, భోజనం చేసే సమయంలో కానీ మధ్య మధ్యలో నీళ్లు( Water ) తాగడం. ఇలా భోజనం మధ్యలో నీళ్లు తాగడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు. ఇలా నీళ్లు తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
భోజనం మధ్యలో నీళ్లు తాగడం.. లేదా తిన్న వెంటనే నీళ్లు గుటగుట తాగేయడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణ రసాలు.. నీళ్లలో కలిసి పలుచగా మారుతాయి. దీంతో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక.. అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఇలా నీళ్లు తాగడం వల్ల ఆహారాల్లో ఉండే పోషకాలు కూడా శరీరం గ్రహించలేదు. సరిగా జీర్ణం కాకుండా మిగిలిపోయే ఆహారాలు కొవ్వు( Fat ) రూపంలోకి మారిపోతాయి. ఇన్సులిన్( Insulin ) నిరోధకత పెరిగిపోతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్( Diabetic ) వస్తుంది. అందుకే భోజనానికి ముందు, మధ్యలో, తిన్న వెంటనే నీళ్లు తాగరాదు. కనీసం 30 నిమిషాల వ్యవధి అయినా సరే ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆహారం తిన్న 30 నిమిషాలకు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.