Cow Milk Vs Buffalo Milk | ఆవు పాలు వర్సెస్ బర్రె పాలు.. ఆరోగ్యానికి ఏవి బెటర్..!
Cow Milk Vs Buffalo Milk | పాలు( Milk ) అన్ని వయసుల వారికి మంచివే. ఎందుకంటే పాలల్లో పోషకాలు( Nutrients ) సమృద్ధిగా లభిస్తాయి. రోజుకు ఒక గ్లాస్ పాలను తాగడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఆవు పాలు( Cow Milk ), బర్రె పాలు( Buffalo Milk ) రెండు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఏ పాలు బెటరో తెలుసుకుందాం..

Cow Milk Vs Buffalo Milk | సంపూర్ణ పౌష్టికాహారంగా భావించే పాలలో విటమిన్ డి( Vitamin D ), కాల్షియం( Calcium ) సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాల వల్ల ఎముకలు( Bones ) దృఢంగా మారుతాయి. శరీరం పెరుగుదల కూడా ఉంటుంది. బరువు కూడా అదుపులో ఉంటుందని చెప్పొచ్చు. అయితే మనకు ఆవు పాలు( Cow Milk ), బర్రె పాలు( Buffalo Milk ) రెండు కూడా లభిస్తాయి. కొందరు బర్రె పాలను, మరికొందరు ఆవు పాలను ఇష్టపడుతుంటారు. మరి నిజానికి మనకు ఈ రెండింటిలో ఏ పాలు బెటర్..? ఎలాంటి శరీర తత్వం ఉన్నవారు ఏ పాలు తాగితే మంచిది..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బర్రె పాలు..( Buffalo Milk )
బర్రె పాలు విరివిగా లభిస్తాయి. తక్కువ ధర కూడా. ఈ పాలను పిల్లలు ఇష్టంగా తాగుతారు. అయితే బర్రె పాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. బర్రె పాలలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. అందువల్ల బర్రె పాలతో మనకు లభించే కేలరీలు కూడా అధికంగా ఉంటాయి. ఈ పాలతో పన్నీర్, ఖీర్, కుల్ఫీ, పెరుగు, నెయ్యి తయారీలో వాడుతారు.
ఆవు పాలు..( Cow Milk )
ఆవు పాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్‌లో చాలా తక్కువగా లభిస్తాయి. వీటి ధర కూడా ఎక్కువే. ఆవు పాలు చాలా లైట్‌గా ఉండి.. తక్కువ ఫ్యాట్‌ను కలిగి ఉంటాయి. ఆవు పాలు త్వరగా జీర్ణమవుతాయి. కాబట్టి పసి పిల్లలకు ఆవు పాలను ఎక్కువగా తాగిస్తారు. ఈ పాలలో నీరు ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆవు పాల ద్వారా మనకు లభించే కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఆవు పాలలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం తక్కువగా ఉంటాయి.
మరి ఏ పాలు తాగితే బెటర్..?
అధిక బరువు ఉన్నవారు ఆవు పాలను తాగడం బెటర్. ఎందుకంటే కేలరీలు తక్కువగా లభిస్తాయి. దీనికి తోడు పోషకాలు కూడా అందుతాయి. కనుక అధిక బరువును తగ్గించుకోవచ్చు. సన్నగా ఉన్నవారు, జీర్ణ శక్తి అధికంగా ఉన్నవారు నిక్షేపంగా బర్రె పాలు తాగవచ్చు. వ్యాయామం రోజూ చేసేవారు కూడా బర్రె పాలను తాగవచ్చు. జీర్ణశక్తి అంతగా లేని వారు ఆవు పాలను తాగితే బెటర్.