Teenage Girls | మీ అమ్మాయి ‘పెద్ద మనిషి’ కాబోతుందా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Teenage Girls | యుక్త వయసు( Teenage ) లోకి ప్రవేశించే అమ్మాయిల్లో వారికి తెలియకుండానే శారీరకంగా( Physically ) మార్పులు జరుగుతుంటాయి. హార్మోన్ల( Hormones ) ప్రభావంతో శారీరంగా వచ్చే మార్పులతో అమ్మాయిలు( Teenage Girls ) ఆందోళనకు గురవుతుంటారు. కాబట్టి హార్మోన్లను సమతుల్యంగా ఉంచేందుకు అమ్మాయిల ఆహారపు అలవాట్లలో( Food Habits ) మార్పులు తప్పనిసరి.

Teenage Girls | మీ అమ్మాయి పెద్ద మనిషి( Teenage ) కాబోతుందా..? అదేనండి రజస్వల( Rajaswala )..! అంటే ఒక అమ్మాయి యుక్త వయసుకు( Teenage ) చేరుకోవడం అన్నమాట. రజస్వల వయసుకు చేరువయ్యే క్రమంలో అమ్మాయిల్లో శారీరకంగా( Physically ), మానసికంగా( Mentally ) పలు మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రధానంగా యుక్త వయసుకు చేరుకునే దశలో అమ్మాయిల్లో హార్మోన్లు( Hormones ) ప్రభావం చూపిస్తాయి. ఈ హార్మోన్ల వల్ల అమ్మాయిలు కాస్త ఇబ్బందికి గురవుతుంటారు. తమకు తెలియకుండానే శరీరంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఆందోళనకు గురవుతుంటారు. ఆ మార్పులతో తాము టీనేజీ దశలోకి వచ్చామన్న భావన అమ్మాయిల్లో కలుగుతుంది.
ఈ దశలో అమ్మాయిల్లో హార్మోన్ల ప్రభావం పడకుండా ఉండాలంటే.. వారి ఆహారపు అలవాట్ల( Food Habits )లో పలు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ముందు నుంచే కొన్ని ఆహార పదార్థాల్ని అమ్మాయిల మెనూ( Girls Diet )లో ఉంచడం వల్ల పోషకాలన్నీ వారి శరీరానికి అందడంతో పాటు ఈ దశనూ వారు సౌకర్యవంతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా దాటేయగలరని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఐరన్ ( Iron )
హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో ఐరన్ (Iron) కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి రజస్వలకు చేరువవుతోన్న అమ్మాయిల్లో హార్మోన్ల ఆరోగ్యానికి ఐరన్ అధికంగా లభించే మునగాకు పొడి మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు అంటున్నారు. రోజూ టీస్పూన్ పొడిని వారు తినే వంటకాల్లో భాగం చేయడం లేదంటే ఉదయాన్నే ఓ గ్లాసు నీటిలో కలిపి ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు. మునగాకు పొడితో పాటు ఐరన్ పుష్కలంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, ఇతర పదార్థాలు వారి మెనూలో ఉండేలా చూసుకోవాలి.
అవిసె గింజలు.. ( Flax Seeds )
అవిసె గింజలు( Flax Seeds ).. ఇవి ప్రతి ఇంట్లో ఉంటాయి. సాధారణంగా అవిసె గింజల పొడిని తయారు చేసుకుని వేడి వేడి ఆహారంలో వేసుకుని ఆరగిస్తుంటారు. కాల్షియం, ఐరన్, మెగ్నీషియంతో పాటు సి, ఇ, కె వంటి విటమిన్లు అవిసె గింజల్లో పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలన్నీ హార్మోన్ల స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయని అంటున్నారు. కాబట్టి టీనేజ్ అమ్మాయిలకు ఇది మంచి ఆహారం అని నిపుణులు సూచిస్తున్నారు.
అంజీర్ ( Anjeer )
రజస్వల ప్రారంభమైన తొలి రోజుల్లో కొంతమంది అమ్మాయిలకు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. దాదాపు వారం రోజుల పాటు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తహీనత సమస్య తలెత్తె అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తహీనత సమస్య తలెత్తకుండా ముందు నుంచే జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు. రక్తహీనత సమస్యకు చెక్ పెట్టాలంటే అంజీర్( Anjeer )ను వారి ఆహారంలో చేర్చడం మంచిదని సూచిస్తున్నారు. ఈ పండు హిమోగ్లోబిన్ స్థాయుల్ని పెంచడంతో పాటు రక్తాన్నీ శుద్ధి చేస్తుందని తెలిపారు. అయితే శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న అమ్మాయిలకు దీన్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఇవ్వాలని సూచిస్తున్నారు. ఫలితంగా ఒంట్లో వేడి మరింత పెరగకుండా జాగ్రత్తపడొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.
క్యాల్షియం ( Calcium )
టీనేజ్‌లోకి ప్రవేశించే అమ్మాయిల్లో ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం( Calcium ) ఎక్కువగా ఉండే పాలు, పాల పదార్థాల్ని అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఇవి ఇష్టపడకపోతే కొబ్బరి/ బాదం/ సోయా పాలు చక్కటి ప్రత్యామ్నాయమని అంటున్నారు. అలాగే ఆకుకూరలు కూడా వారికి మంచిదని చెబుతున్నారు. శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల అలసట, నీరసం ఆవహిస్తుందట. వీటిని ఎదుర్కొని శారీరక శక్తి స్థాయుల్ని పెంచుకోవాలంటే బీన్స్, పప్పులు, చేపలు, నిమ్మజాతి పండ్లు, సెరల్స్ వంటివి మేలు చేస్తాయని సలహా ఇస్తున్నారు.
ప్రొటీన్లు ( Proteins )
శరీరంలో కొన్ని రకాల హార్మోన్లలో మార్పుల కారణంగా కడుపుబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయట. కాబట్టి ఎదిగే అమ్మాయిల్లో ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉండే క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్, పప్పులు, తాజా పండ్లు, కాయగూరలు వారి మెనూలో చేర్చాలని సూచిస్తున్నారు. శరీరంలో హార్మోన్లు, ఎంజైమ్‌ల స్థాయుల్ని క్రమబద్ధీకరించి కండరాల్ని దృఢం చేయడంలో ప్రొటీన్ల కీలక పాత్ర పోషిస్తాయట. కాబట్టి రజస్వలకు దగ్గరయ్యే అమ్మాయిలు ప్రొటీన్లు( Proteins ) ఎక్కువగా లభించే పప్పులు, గింజలు, కోడిగుడ్ల, మాంసం, చేపలను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
ఇవీ ముఖ్యమే!
రజస్వలకు చేరువవుతోన్న అమ్మాయిల్లో హార్మోన్ల ఆరోగ్యానికి ఆహారంతో పాటు కొన్ని అలవాట్లను పాటించాలని నిపుణులు అంటున్నారు. రోజూ అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల హార్మోన్లూ సమతులంగా ఉంటాయని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మానసిక సమస్యలూ దరిచేరవని తెలిపారు. ఇంకా బరువు కూడా అదుపులో ఉండి భవిష్యత్తులో థైరాయిడ్( Thyroid ), పీసీఓఎస్(PCOS) వంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చని వివరిస్తున్నారు. ఈ వయసులో పిల్లలు కూల్ డ్రింక్స్( Cool Drinks ), జంక్ ఫుడ్లకు( Junk Food ) ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. ఇలాంటి వాటి వల్ల కూడా హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలు వీటికి దూరంగా ఉండేలా చూడడం మంచిదని సూచిస్తున్నారు.