Health tips | మీకు మధుమేహం ఉందా.. అయితే ఇవి తప్పక తినాలి..!
Health tips : మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నది. అధిక కేలరీలున్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేని జీవనశైలి, బరువు పెరుగడం లాంటివి మధుమేహం విస్తరణకు ప్రధాన కారణాలు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు.

Health tips : మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నది. అధిక కేలరీలున్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేని జీవనశైలి, బరువు పెరుగడం లాంటివి మధుమేహం విస్తరణకు ప్రధాన కారణాలు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. కీరదోసను మన ఆహరంలో భాగం చేసుకోవడం ద్వారా షుగర్‌ను అదుపులో పెట్టుకోవచ్చు. కీరదోసతో లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయోజనాలు
- కీర దోసకాయలు శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపిస్తాయి. ఇవి హైపర్ గ్లైసీమియా, మంటను నియంత్రించడంలో కూడా సహాయపడుతాయి.
- కీరదోసవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కీరదోసను తరచూ తీసుకోవడంవల్ల శరీరంలో కొవ్వులు తగ్గిపోతాయి. దాంతో బరువు తగ్గడంతోపాటు డయాబెటిస్ కూడా తగ్గిపోతుంది.
- కీర దోసకాయల్లోని యాంటీ-హైపర్ గ్లైసిమిక్ ప్రభావం గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి సాయపడుతుంది.
- కీర దోసకాయలపై తొక్కలు కూడా మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయట. ఎందుకంటే దోస తొక్కల్లో ఆస్కార్బిక్ ఆమ్లం, పాలీఫెరాల్స్, ఫ్లవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మధుమేహాన్ని అదుపు చేయడంతో కీలకపాత్ర పోషిస్తాయి.