Health tips | మీలో ఈ అనారోగ్య లక్షణాలున్నాయా.. అయితే మీ లివర్‌ డేంజర్‌లో పడుతున్నట్టే..!

Health tips : మన శరీరంలోని ప్రధాన అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం ప్రధాన విధి మన శరీరాన్ని విష రహితం చేయడం. మనం తీసుకునే వివిధ ఆహారపదార్థాల ద్వారా శరీరంలో చేరే హానికర కారకాలను కాలేయం ఎప్పటికప్పుడు శుద్ధిచేస్తుంది. జీవక్రియల నిర్వహణలో, పోషకాల నిలువలో కీలకపాత్ర పోషిస్తుంది.

Health tips | మీలో ఈ అనారోగ్య లక్షణాలున్నాయా.. అయితే మీ లివర్‌ డేంజర్‌లో పడుతున్నట్టే..!

Health tips : మన శరీరంలోని ప్రధాన అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయం ప్రధాన విధి మన శరీరాన్ని విష రహితం చేయడం. మనం తీసుకునే వివిధ ఆహారపదార్థాల ద్వారా శరీరంలో చేరే హానికర కారకాలను కాలేయం ఎప్పటికప్పుడు శుద్ధిచేస్తుంది. జీవక్రియల నిర్వహణలో, పోషకాల నిలువలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆల్కహాల్ తాగేవారిలో కాలేయ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే వైరల్ ఇన్ఫెక్షన్‌లు, కలుషిత నీరు, ఊబకాయం, జన్యుపరమైన కారణాలవల్ల ఆల్కహాల్‌ అలవాటు లేని వారిలో కూడా కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కాలేయం సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే దానికి సంబంధించిన సమస్యలను ముందే గుర్తించగలగాలి. తద్వారా సకాలంలో చికిత్స చేయించుకుని సమస్య నుంచి బయటపడవచ్చు. కాలేయ సమస్యలను ముందే గుర్తించాలంటే.. కాలేయం అనారోగ్యానికి గురైనప్పుడు మనలో కనిపించే కొన్ని లక్షణాలపై అవగాహన ఉండాలి. ఆ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాలేయ సమస్య లక్షణాలు

అలసట-బలహీనత

నిరంతర అలసట, బలహీనత అనేవి కాలేయ సమస్యను గురించి తెలిపే ప్రారంభ సంకేతాలు. కాబట్టి నిరంతరం అలసటగా అనిపిస్తున్నట్లయితే వెంటనే ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

మూత్రం రంగు

కాలేయ సమస్యలవల్ల మూత్రం రంగు మారుతుంది. సాధారణంగా ఈ స్థితిలో మూత్రం గోధుమ రంగులోకి మారుతుంది. మూత్రంలో బైలురూబిన్ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ఇది సాధారణంగా కాలేయం ద్వారా తొలగించబడుతుంది. కాలేయంలో సమస్య ఉన్నప్పుడు ఆ ప్రక్రియ సులువుగా జరగదు కాబట్టి మూత్రం రంగులో మార్పు తెలుస్తుంది.

మలం రంగు

మలం లేత రంగులో లేదంటే మట్టి రంగులో ఉందంటే కాలేయంలో సమస్య ఉందని అర్థం. కాలేయంలో సమస్యవల్ల దానిలో ఉత్పత్తయ్యే పిత్త పరిమాణం తగ్గి మలం రంగు మారుతుంది.

ఎపిగాస్ట్రిక్ నొప్పి

ఈ ఎపిగాస్ట్రిక్‌ నొప్పి ఉదరం పైభాగంలో వస్తుంది. ఇది కాలేయం వాపు, విస్తరణకు సంకేతం. ఈ నొప్పి తేలికపాటిగా ఉండొచ్చు, చాలా తీవ్రంగా ఉండొచ్చు. కొవ్వు పదార్ధాలున్న ఆహారం తిన్నప్పుడు ఈ నొప్పి పెరుగుతుంది.

కాళ్ల వాపు

సిర్రోసిస్ లాంటి కాలేయ సమస్యలతో ద్రవాల నిలుపుదల కారణంగా వాపు సంభవించవచ్చు. శరీరంలో ద్రవం పేరుకుపోయి పాదాలు, చీలమండల్లో వాపు వస్తుంది.

దురద

కాలేయ వ్యాధి ఉన్న రోగులకు చర్మం కింద పిత్త లవణాలు పేరుకుపోవడంవల్ల ప్రురిటస్ అని కూడా పిలువబడే నిరంతర దురద ఉంటుంది. ఈ దురద ఎక్కడైనా రావచ్చు. అరిచేతులు, అరికాళ్లపై ఎక్కువగా కనిపిస్తుంది.