Health tips | బలాన్నిచ్చే ఈ బాదం గింజలను ఏ వయస్సు వారు ఎన్ని తినాలో తెలుసా..?

Health tips | డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు మెండుగా ఉంటాయి. తరచూ డ్రై ఫ్రూట్స్‌ తినడం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం బాదంపప్పు తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నీళ్లలో నానబెట్టిన బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు.

Health tips | బలాన్నిచ్చే ఈ బాదం గింజలను ఏ వయస్సు వారు ఎన్ని తినాలో తెలుసా..?

Health tips | డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు మెండుగా ఉంటాయి. తరచూ డ్రై ఫ్రూట్స్‌ తినడం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం బాదంపప్పు తినడం ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నీళ్లలో నానబెట్టిన బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు. అయితే ఈ బాదం గింజలను అతిగా తీసుకుంటే అనర్థమని, మితంగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాదం గింజలతో కలిగే ప్రయోజనాలేమిటి..? రోజూ ఏ వయస్సు వారు ఎన్ని గింజలు తీసుకోవాలి..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయోజనాలు..

  • మంచి జీర్ణశక్తికి బాదం ఉపయోగకరంగా ఉంటుంది. బాదంపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా బాదం తోడ్పడుతుంది. బాదంలోని మెగ్నీషియం ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
  • బాదంలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కాంతిని పెంచుతాయి. దాంతో చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. బాదం ఎముకలను బలోపేతం చేస్తుంది. బలమైన ఎముకలకు కాల్షియం, ఫాస్పరస్ అవసరం. బాదంలో ఆ రెండూ సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ బాదంపప్పు తినాలి. బాదం పప్పు తింటే కొవ్వు పెరగదు.
  • రోగనిరోధక శక్తిని పెంచడంలో బాదం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజూ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే అతిగా తింటే మాత్రం ఇబ్బందులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్దలు రోజూ 20 వరకు బాదం గింజలు తినొచ్చని సూచిస్తున్నారు. వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ కంటే ముందే తీసుకోవడంవల్ల మంచి ఫలితం ఉంటుందట.
  • ఇక చిన్న పిల్లలకు రోజుకు 3-4 బాదం పప్పులు తినిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 4-8 ఏళ్ల మధ్య పిల్లలకు రోజుకు 5-8 బాదం పప్పులు తినిపించవచ్చట. 9-18 ఏళ్ల మధ్య వయస్సు వారికి రోజుకు 10 బాదం పప్పుల వరకు తినవచ్చని సూచిస్తున్నారు.