Acidity | పాల వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుందా..? తగ్గుతుందా..?
Acidity | చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు ఎవరైనా సరే పాలు( Milk ) తాగొచ్చు. పాలల్లో కాల్షియం( Calcium ) పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి పాలను తాగడం వల్ల శరీరంలోని ఎముకలు( Bones ), దంతాలు( Teeth ) బలపడుతాయి. కానీ పాలు తాగడం వల్ల ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ( Acidity ) సమస్యతో బాధపడేవారు పాలను తాగడం వల్ల ఆ సమస్యకు […]
Acidity | చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు ఎవరైనా సరే పాలు( Milk ) తాగొచ్చు. పాలల్లో కాల్షియం( Calcium ) పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి పాలను తాగడం వల్ల శరీరంలోని ఎముకలు( Bones ), దంతాలు( Teeth ) బలపడుతాయి. కానీ పాలు తాగడం వల్ల ఇతర సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ( Acidity ) సమస్యతో బాధపడేవారు పాలను తాగడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చని కొందరు అంటున్నారు. ఇంకొందరేమో.. పాలను తాగడం వల్ల ఎసిడిటీ సమస్యను మరింత పెంచుకున్నట్టేనని పేర్కొంటున్నారు. ఇందులో నిజమేదో తెలుసుకుందాం..
ఎసిడిటీతో బాధపడేవారు పాలను తాగడం వల్ల అందులోని ఆల్కలీన్ స్వభావం కడుపులోని అదనపు యాసిడ్స్( Acids )ను తటస్థం చేయడంలో సహాయపడుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్కలీన్ స్వభావం కడుపులో మంటను, యాసిడ్ రిఫ్లక్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు.
కానీ ఇంకొదరి వాదన భిన్నంగా ఉంది. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు పాలను తాగొద్దని సూచిస్తున్నారు. పాలల్లో ఉండే కొవ్వు( Fat ), ప్రోటీన్లు( Proteins ) కడుపులో యాసిడ్ ఉత్పత్తని పెంచుతాయి. ఆమ్లత్వ లక్షణాలు మరింత పెంచుతాయి. లాక్టోస్ అసమతుల్యంగా ఉండే పాలు తీసుకోవడం వల్ల ఇతర జీర్ణ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. అయితే కడుపు నుంచి విడుదలైన ఆమ్లాలు అన్నవాహికలోకి తిరిగి వెళ్లినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ సంభవిస్తుంది. దీని వల్ల ఛాతిలో, గొంతులో మంటగా అనిపిస్తుంది. అయితే పాలు ఎసిడిటీకి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి కానీ శాశ్వత పరిష్కారం కాదు.
మరి ఎసిడిటీకి చెక్ పెట్టేదేలా..?
ఎసిడిటికీ చెక్ పెట్టాలంటే మసాలా ఫుడ్‌కు దూరంగా ఉండాలి. స్పైసీ, కొవ్వు పదార్థాలను అసలే తినకూడదు. ఒత్తిడిని తగ్గించుకొని, పుష్కలంగా నీరు తాగాలి. వీలైనంత వరకు మజ్జిగ( Butter Milk ) తాగడం మంచిది. రోజుకు మూడు నుంచి ఐదు గ్లాసుల మజ్జిగ తీసుకుంటే ఎసిడిటినీ 100 శాతం దూరం పెట్టొచ్చు. ఆహారం కూడా సులువుగా జీర్ణమవుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram