మున‌గ కంటే బీట్ రూట్ బెట‌రా..? ఏది వెజిట‌బుల్ వ‌యాగ్రా..?

దాంప‌త్య జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. విలాస‌వంత‌మైన ఇల్లు, కావాల్సినంత డ‌బ్బు ఉంటే స‌రిపోదు. దంప‌తుల మ‌ధ్య అన్యోన్య‌త కూడా ఉండాలి. ఇరువురు ప్రేమ‌ను పంచుకోవాలి. ప‌డ‌క గ‌దిలో ముద్దులు, ముచ్చ‌ట్లు, కౌగిలింత‌ల్లో ఒదిగిపోవాలి. అప్పుడే ఆ దాంప‌త్య జీవితం సాఫీగా సాగిన‌ట్టు. అయితే బిజీ లైఫ్ స్టైల్ కార‌ణంగా ప‌డ‌క గ‌దికి అధిక స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నారు. ఒక వేళ స‌మ‌యం కేటాయించినా.. శృంగార‌ అనుభూతి పొంద‌లేక‌పోతున్నారు.

  • By: raj    health    May 09, 2024 9:19 AM IST
మున‌గ కంటే బీట్ రూట్ బెట‌రా..? ఏది వెజిట‌బుల్ వ‌యాగ్రా..?

దాంప‌త్య జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. విలాస‌వంత‌మైన ఇల్లు, కావాల్సినంత డ‌బ్బు ఉంటే స‌రిపోదు. దంప‌తుల మ‌ధ్య అన్యోన్య‌త కూడా ఉండాలి. ఇరువురు ప్రేమ‌ను పంచుకోవాలి. ప‌డ‌క గ‌దిలో ముద్దులు, ముచ్చ‌ట్లు, కౌగిలింత‌ల్లో ఒదిగిపోవాలి. అప్పుడే ఆ దాంప‌త్య జీవితం సాఫీగా సాగిన‌ట్టు. అయితే బిజీ లైఫ్ స్టైల్ కార‌ణంగా ప‌డ‌క గ‌దికి అధిక స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నారు. ఒక వేళ స‌మ‌యం కేటాయించినా.. శృంగార‌ అనుభూతి పొంద‌లేక‌పోతున్నారు. కాబ‌ట్టి ఉన్న స‌మ‌యంలోనే లైంగిక‌ జీవితాన్ని హాయిగా గ‌డ‌పాలంటే.. ఆహార‌పు అల‌వాట్ల‌ను కూడా మార్చుకోవాలి. శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాలి. జీవిత భాగ‌స్వామికి కావాల్సినంత ప్రేమ‌ను, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలి. మ‌రి అందు కోసం ఏదో వ‌యాగ్రాలు వాడ‌న‌వ‌స‌రం లేదు.. నిత్యం మ‌న క‌ళ్ల ముందు క‌నిపించే మున‌గ‌, బీట్ రూట్ తీసుకుంటే స‌రిపోతోంది. ఈ రెండింటిలో ఏది బెట‌ర్ అనేది కూడా ఇంపార్టెంట్.

మున‌గ కాయ‌లు, మున‌గాకు తింటే పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంద‌నే భావ‌న ఉంది. అందుకే పెళ్లైన కొత్త‌లో పురుషుల‌కు మున‌గకాయ‌లు తినాల‌ని సూచిస్తుంటారు పెద్ద‌లు. అయితే మున‌గ కాయ‌ల మాదిరిగానే బీట్‌రూట్ కూడా లైంగిక సామ‌ర్థ్యాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. మున‌గ కాయ‌లు అందుబాటులో లేక‌పోతే.. బీట్‌రూట్‌ను కూడా తీసుకోవ‌చ్చు. మున‌గ‌తో పోల్చితే బీట్ రూట్ ర‌క్త ప్ర‌స‌ర‌ణను మెరుగు ప‌రిచి మ‌రింత సామ‌ర్థ్యాన్ని ఇస్తుంద‌ని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

బీట్ రూట్ తిన్నపుడు దానిలోని బ్యాక్టీరియా, ఎంజైములతో రసాయన చర్య జరిగి దాంట్లోని నైట్రేట్ నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాల‌ను విస్తరించేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అంతే కాకుండా నైట్రిక్ ఆక్సైడ్ పురుషుల్లో టెస్టోస్టిరాన్ మెరుగుపడేందుకు కూడా దోహదం చేస్తుందట. అందువల్ల ఆ సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. రక్తప్రసరణ మెరుగవడం వల్ల గుండె, రక్తనాళాల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ర‌క్త ప్రసరణ వ్యవస్థ నేరుగా ఆ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి.. బీట్ రూట్‌తో ఆ సామర్థ్యం పెరుగుతుందని చెప్పవచ్చు. కానీ అద్భుతాలను ఆశించ‌కూడ‌ద‌ని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.