Coriandrum Seeds | కొత్తిమీర గింజలు.. గుండె ఆరోగ్యానికి వరం..!
Coriandrum Seeds | కొత్తిమీర( Coriandrum ) .. ఈ ఆకు ప్రతి వంటింట్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఏ కూర చేసినా.. చివర్లో కొత్తిమీర వేయకుండా ముగించరు. కొత్తిమీర వేసిన కూర ఫ్లేవర్ వేరే లెవల్‌లో ఉంటుంది. మరి కొత్తిమీర గింజలు( Coriandrum Seeds )కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను( Health Benefits ) అందిస్తున్నాయి. మరి ముఖ్యంగా గుండె( Heart ) ఆరోగ్యానికి వరంలాగా కొత్తిమీర గింజలు పని చేస్తాయి.

Coriandrum Seeds | వంటింట సువాసనలు వెదజల్లే కొత్తిమీర( Coriandrum ) .. అన్ని కూరలను కూడా ఘుమఘుమలాడిస్తుంది. ఆయుర్వేదం( Ayurvedam )గా ఎంతో ప్రాధాన్యత ఉన్న కొత్తిమీర.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కొత్తిమీర గింజలను( Coriandrum Seeds ) మన మెనూలో భాగం చేసుకుంటే గుండె రోగాలు దరిచేరవు. గుండె ఆరోగ్యానికి వరం మాదిరి కొత్తిమీర గింజలు పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు( Health Experts ) చెబుతున్నారు. అయితే కొత్తిమీర గింజలను రాత్రి వేళ నానబెట్టి.. ఉదయాన్ని ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు( Health Benefits ) కలుగుతాయని సూచిస్తున్నారు.
కొత్తిమీర గింజల వల్ల కలిగే లాభాలివే..
కొత్తిమీర గింజలను రాత్రి నానబెట్టి.. పొద్దున్నే బరిగడుపున ఆ నీటిని తాగడం కారణంగా.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య కూడా అంతమవుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడి.. ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి కొత్తిమీర గింజలు.
ఇక షుగర్ వ్యాధితో బాధపడేవారికి కూడా కొత్తిమీర గింజలు మంచి ఔషధంగా పని చేస్తాయి. కొత్తిమీర గింజలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడం ద్వారా డయాబెటిస్‌ను కంట్రోల్‌లో పెట్టొచ్చు.
జుట్టు సమస్యతో బాధపడేవారికి కూడా ఈ గింజలు ఎంతో ఉపయోగం. కొత్తిమీర గింజలను తినడంతో.. చాలా వరకు జుట్టు రాలడం తగ్గిపోతోంది. కొత్త జుట్టు వచ్చేందుకు కొత్తిమీర గింజలు దోహదం చేస్తాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొత్తిమీర గింజలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొత్తిమీర గింజలను రోజూ ఉపయోగించడం వల్ల ఈ ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు.