సెలెబ్రిటీలు, పోషకాహార నిపుణులు ఘోషిస్తుంటారు ఈ పానీయం గురించి. రోజూ ఉదయం అల్పాహారానికి పావుగంట లేదా అరగంట ముందు తాగితే ఇది మీ పాలిటి అమృతమే. చాలామంది ఇప్పటికే ఎవరో చెప్పారని తాగుతూంటారు కానీ, వారికీ తెలియదు తాము ఆరోగ్యంగా ఉన్నామంటే అదే కారణమని.
సెలెబ్రిటీలు, పోషకాహార నిపుణులు ఘోషిస్తుంటారు ఈ పానీయం గురించి. రోజూ ఉదయం అల్పాహారానికి పావుగంట లేదా అరగంట ముందు తాగితే ఇది మీ పాలిటి అమృతమే. చాలామంది ఇప్పటికే ఎవరో చెప్పారని తాగుతూంటారు కానీ, వారికీ తెలియదు తాము ఆరోగ్యంగా ఉన్నామంటే అదే కారణమని.
వేడినీళ్లు–నిమ్మరసం(Lukewarm water- & Lemon juice combination) . ఈ కలయిక అమృతప్రాయమని వైద్యులు, పోషకాహార నిపుణులు ఎప్పుడూ చెపుతుంటారు. మన ఆయుర్వేదంలో ఎప్పుడో ఈ పానీయం వల్ల కలిగే లాభాల గురించి విస్తృతంగా వివరించారు. ఒక కప్పు లేదా ఒక గ్లాసు (8 ఔన్సులు లేదా 237 ఎంఎల్) గోరువెచ్చటి నీళ్లలో సగం నిమ్మకాయ రసం కలుపుకుని ఉదయం పరగడుపున తాగితే జీర్ణక్రియకు, విషపదార్ధాలను శరీరం నుండి వెలివేయడానికి ఉపకరిస్తుంది.
ఇవే కాకుండా ఇతర ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం.
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది(Increases Immunity) – నిమ్మకాయలలో విటమిన్–సి, బీకాంప్లెక్ విటమిన్లు, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. నిమ్మరసంలో లభించే విటమిన్–సి, ఒత్తిడిని అధిగమించడానికి, వైరల్ ఇన్ఫెక్షన్లు, గొంతునొప్పితో పోరాడటానికి ఎంతో ఉపయోగపడుతుంది. పొటాషియం గుండె, మెదడు, నరాల ఆరోగ్యానికి చాలా మంచిది.
వాపులను తగ్గిస్తుంది, శరీరాన్ని శుభ్రపరుస్తుంది(Reduces Inflammation & Cleanses body) – రోజూ నిమ్మరసం తాగడం వల్ల కడుపులో ఆసిడిటీ తగ్గడమే కాకుండా జాయింట్లలో యూరిక్ ఆసిడ్‌ను నిర్మూలిస్తుంది. ఎంజైమ్‌ల పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయాన్ని ఉత్తేజపరిచి, పైత్యరసం సులభంగా ప్రవహించడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా కొవ్వులో కరిగే విషపదార్థాలను బయటకు పారద్రోలడానికి ఉపకరిస్తుంది.
మరకలు లేని చర్మాన్నిస్తుంది (Makes the Skin Wrinkle & Blemish free) – నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్లు, చర్మం మీది మరకలను, గీతలను, ముడుతలను తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది (Encourages losing weight)– నిమ్మకాయలో ఉంటే ఫైబర్లు ఆకలిని మందగింపజేసి, ఆహారం కోసం వెంపర్లాడకుండా నిరోధిస్తుంది.
అయితే నిమ్మరసంతో ఒక ప్రమాదం కూడా ఉన్నది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ పళ్లపై ఉండే ఎనామిల్ పొరను పాడుచేస్తుంది(Damages enamel on teeth). ఆ నష్టాన్ని నివారించేందుకే గోరువెచ్చని నీళ్లలో కలపి తాగడం. నీరు మరీ పొగలు వచ్చేంత వేడిగా ఉండొద్దు. కావాలంటే స్ట్రా వేసుకుని తాగితే పళ్లకు తాకకుండా లోపలికి వెళ్లిపోతుంది. తాగిన తర్వాత ఒకసారి నోరు పుక్కిలించితే సరిపోతుంది.
ఒక హెచ్చరిక: నిమ్మకాయ తొక్కను ఎప్పుడూ నీళ్లలో వేయకూడదు. తొక్క మీద రోగకారకాలైన అనేక సూక్ష్మజీవులుంటాయని పరిశోధనల్లో తేలింది.
ఎక్కుగా నీరు తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెపుతుంటారు. దాన్లో ఓ గ్లాసు వేడినీళ్లు–నిమ్మరసం అలవాటు చేస్తే సరి. ఇక అంతా ఆరోగ్యమే.