ఎండు ద్రాక్షల వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
ఎండు ద్రాక్ష.. చూడడానికి చిన్నదిగా ఉంటుంది. కానీ ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్లు కూడా అధికంగానే ఉంటాయి

ఎండు ద్రాక్ష.. చూడడానికి చిన్నదిగా ఉంటుంది. కానీ ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్లు కూడా అధికంగానే ఉంటాయి. మన మెనూలో ఈ డ్రై ఫ్రూట్‌ను చేర్చుకుంటే.. మన శరీరానికి కావాల్సినన్ని పోషకాలు అందుతాయి. ఎండు ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరానికి ఎంతో ఉపయోగపడుతాయి. ఈ ఫ్రూట్ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి అన్ని వయసుల వారు ప్రతి రోజు ఎండ్రు ద్రాక్షలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
ఎండు ద్రాక్షల వల్ల ఉపయోగాలు ఇవే..
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
- ఎండు ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నిత్యం ఎండు ద్రాక్షలను తీసుకోవడం వల్ల మలబద్దకాన్ని నివారించొచ్చు.
- బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజూ ఎండు ద్రాక్షలను తినడం మంచిది. ఎందుకంటే ఆకలి త్వరగా కానివ్వదు. కడుపు నిండుగానే ఉన్నట్లు అనిపిస్తుంది.
- ఎండు ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి హానీకరమైన అణువులను నిర్మూలించడంలో సహాయపడుతాయి. శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతాయి.
- గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించే అవకాశం ఉంది. కాలేయాన్ని రక్షిస్తుంది. అంతేకాదు ఎండు ద్రాక్ష క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. కంటి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
- ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ బీ6 వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి. శరీరమంతటా ఆక్సిజన్‌ను తీసుకెళ్లేందుకు ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. విటమిన్ బీ6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
- ఎండుద్రాక్షల్లో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి మన శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. ఔషధ గుణాలున్న ఎండుద్రాక్షను వారానికి రెండుసార్లు తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.