Curd | రాత్రిపూట పెరుగు తింటే ప్రమాదకరమా..?
Curd | పెరుగు అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? అంటే నో అని చెప్పొచ్చు. ఎందుకంటే పెరుగు లేనిదే కొందరికి ముద్ద దిగదు. తప్పనిసరిగా భోజనం చివర్లో పెరుగుతో తినకపోతే చాలా మందికి భోజనం చేసినట్టు కూడా ఉండదు. కాబట్టి పెరుగును తినే వారు చాలా మందే ఉంటారు. అయితే రాత్రి పూట పెరుగు తింటే ప్రమాదకరమా..? ఒక వేళ తింటే ఎలాంటి నష్టాలు సంభవిస్తాయో తెలుసుకుందాం. రాత్రి పూట పెరుగు తింటే శరీరంలో బద్ధకం […]

Curd | పెరుగు అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? అంటే నో అని చెప్పొచ్చు. ఎందుకంటే పెరుగు లేనిదే కొందరికి ముద్ద దిగదు. తప్పనిసరిగా భోజనం చివర్లో పెరుగుతో తినకపోతే చాలా మందికి భోజనం చేసినట్టు కూడా ఉండదు. కాబట్టి పెరుగును తినే వారు చాలా మందే ఉంటారు. అయితే రాత్రి పూట పెరుగు తింటే ప్రమాదకరమా..? ఒక వేళ తింటే ఎలాంటి నష్టాలు సంభవిస్తాయో తెలుసుకుందాం.
- రాత్రి పూట పెరుగు తింటే శరీరంలో బద్ధకం వస్తుంది.
- పెరుగులోని తీపి శరీరంలో శ్లేష్మాన్ని ఏర్పరుస్తుంది.
- ఈ శ్లేష్మం వల్ల శ్వాసకోశ సమస్యలు సంభవిస్తాయి.
- నాసికా భాగాల్లో ఇబ్బందులు ఏర్పడుతాయి.
- శరీరం వాపుకు కూడా దారి తీస్తుంది.
- ఇక జలుబుతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు అసలు తినకూడదు.
- ఒక వేళ పెరుగే తినాలనిపిస్తే.. మజ్జిగ తాగడం మంచిది.
- శరీరంలో శ్లేష్మం ఏర్పడకుండా ఉండాలంటే.. పెరుగులో చక్కెర, తేనే, బెల్లం లేదా ఉప్పు, ఎండు మిర్చి, జీలకర్ర పొడి వంటి దినుసులు కలుపుకుని తినాలి. ఇది పెరుగు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. శ్లేష్మాన్ని తగ్గిస్తుంది.
- పెరుగును అతిగా తింటే మాత్రం అనార్థాలు తప్పవు. తలలో నొప్పి, మైగ్రేన్ ని ప్రేరేపించే ఆహారం పెరుగు. బయోజెనిక్ అమైన్ వల్ల ఇలా జరుగుతుంది. ఈ అమైన్‌లు నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొచ్చి రక్తప్రసరణ తగ్గిస్తాయి లేదంటే పెంచుతాయి. దీని వల్ల తలనొప్పి వస్తుంది.
- పెరుగు తినడం వల్ల ఆర్థరైటిస్ సమస్యలు ఉన్న వారిలో మంట, కీళ్ల నొప్పులు పెరిగే అవకాశం ఉంది. పెరుగులోని కొన్ని ప్రోటీన్స్ ఆ నొప్పులను ఎక్కువ చేస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు పెరుగు తింటే త్వరగా అంటువ్యాధుల బారిన పడతారు.