Toothpaste | ఏ మోతాదులో టూత్‌ పేస్ట్ వాడితే మంచిది..? డెంటిస్టులు ఏం చెబుతున్నారంటే..?

Toothpaste | ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌తి రోజు త‌మ దంతాల‌ను( Teeth ) శుభ్రం చేసుకుంటారు. కొంద‌రు టూత్ పేస్ట్( Toothpaste ) వాడితే.. మ‌రికొంద‌రు ర‌క‌ర‌కాల ప‌ళ్ల పొడుల‌ను, ఇంకొంద‌రు వేప పుల్ల‌ల‌ను వినియోగిస్తుంటారు.

  • By: raj    health    Apr 09, 2025 10:45 PM IST
Toothpaste | ఏ మోతాదులో టూత్‌ పేస్ట్ వాడితే మంచిది..? డెంటిస్టులు ఏం చెబుతున్నారంటే..?

Toothpaste | ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌తి రోజు త‌మ దంతాల‌ను( Teeth ) శుభ్రం చేసుకుంటారు. కొంద‌రు టూత్ పేస్ట్( Toothpaste ) వాడితే.. మ‌రికొంద‌రు ర‌క‌ర‌కాల ప‌ళ్ల పొడుల‌ను, ఇంకొంద‌రు వేప పుల్ల‌ల‌ను వినియోగిస్తుంటారు. ఈ ర‌కంగా దంతాల‌ను శుభ్రం చేసుకుంటుంటారు. దీంతో నోటి నుంచి దుర్వాస‌న రాకుండా ఉంటుంది. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అయితే చాలా మంది దంతాల‌ను శుభ్రం చేసుకునేందుకు వివిధ ర‌కాల టూత్ పేస్టుల‌ను వాడుతుంటారు. మ‌రి ఏ మోతాదులో టూత్ పేస్ట్ వాడితే మంచిది..? అతిగా టూత్ పేస్ట్ వాడితే వ‌చ్చే అన‌ర్థాలు ఏంటో తెలుసుకుందాం.

అతిగా టూత్ పేస్ట్ వాడితే అప‌స్మార‌క‌స్థితిలోకి..

-అధికంగా టూత్ పేస్ట్‌ను వాడ‌డం వ‌ల్ల అందులో ఉండే ఫ్లోరైడ్ వ‌ల్ల పెద్ద‌ల్లో అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిపోయే ప్ర‌మాదం ఉంటుంది. వికారం, వాంతులు సంభ‌వించే ప్ర‌మాదం ఉంటుంది.

-ఇక ఎక్కువ స‌మ‌యం బ్ర‌ష్ చేయ‌డం మూలంగా.. దంతాల‌పై ఉండే ఎనామిల్ క్ర‌మంగా త‌గ్గిపోయే అవ‌కాశం ఉంది. గ‌ట్టిగా ఉన్న బ్ర‌ష్‌తో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌ద్దు.

-ఇక పిల్ల‌ల్లో ఎనామిల్ ఏర్ప‌డే స‌మ‌యంలో అధిక ఫ్లోరైడ్ తీసుకోవ‌డం వ‌ల్ల దంతాలు రంగు మారే అవ‌కాశం ఉంది. దాంతో పాటు తెల్ల‌టి మ‌చ్చ‌లు కూడా ఏర్పడే అవ‌కాశం ఉంది.

-చాలా మంది పిల్ల‌లు టూత్ పేస్ట్‌ను మింగేస్తుంటారు. ఇది హానీక‌ర‌మ‌ని డెంటిస్టులు చెబుతున్నారు.

ఏ మోతాదులో టూత్ పేస్ట్ తీసుకోవాలి..?

-పెద్ద‌లు అయితే బ‌ఠాణి గింజ ప‌రిమాణంలో టూత్ పేస్ట్ తీసుకుని దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప‌రిమాణంలో పేస్ట్ వినియోగించ‌డం వ‌ల్ల దంతాలు బ‌లోపేతంగా మారుతాయి. దంతాల‌కు స‌రైన మోతాదులో ఫ్లోరైడ్ అందుతుంది.

-3-6 ఏండ్ల లోపు పిల్ల‌ల‌కు కూడా బ‌ఠాణి గింజ ప‌రిమాణంలో టూత్ పేస్ట్ అందిస్తే స‌రిపోతుంది.

– మూడేండ్ల లోపు పిల్ల‌ల‌కు బియ్యం గింజ ప‌రిమాణంలో టూత్ పేస్ట్‌ను ఇవ్వాలి.

రోజుకు రెండు సార్లు బ్ర‌ష్ చేసుకోవాలి..

దంత క్షయాన్ని నివారించడానికి ఫ్లోరైడ్ అవసరం. కాబ‌ట్టి ఫ్లోరైడ్ క‌లిగిన టూత్ పేస్ట్ వాడ‌డం చాలా ముఖ్యం. రోజుకు రెండు సార్లు బ్ర‌ష్ చేస్తే స‌రిపోతోంది. ఒక‌ట్రెండు నిమిషాల కంటే ఎక్కువ‌గా బ్ర‌ష్ చేయ‌కూడదు. చిగుళ్ల నొప్పి ఉంటే డెంటిస్టును క‌ల‌వ‌డం మంచిది. దంతాల‌ను ఆరోగ్యంగా ఉంచుకోక‌పోతే చాలా ర‌కాల స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంది.