Health tips | మధుమేహులకు బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?

Health tips | మధుమేహులకు బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?

Health tips : బొబ్బ‌ర్లు (అల‌సంద‌లు) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొబ్బ‌ర్ల‌లో కొవ్వులు, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉండ‌టంతోపాటు పీచు ప‌దార్థం (ఫైబ‌ర్‌) ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఇవి స్థూల‌కాయం లాంటి స‌మ‌స్య‌ల‌తోపాటు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మంచి ప‌రిష్కారం చూపుతాయి. మ‌రి బొబ్బ‌ర్ల‌తో ఎలాంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో తెలుసుకుందామా..?

ప్రయోజ‌నాలు

  • అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారికి బొబ్బ‌ర్లు మంచి ఉప‌యోగ‌కర‌మైన ఆహారం. బొబ్బ‌ర్ల‌లో క్యాల‌రీల‌తోపాటు కొవ్వులు కూడా త‌క్కువ‌గా ఉండ‌టంవ‌ల్ల బరువు తగ్గడానికి తోడ్ప‌డుతాయి. వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ఫైబ‌ర్‌ అధిక‌ బరువును తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.
  • మధుమేహుల‌కు లో-గ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన బొబ్బ‌ర్లు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి.
  • బొబ్బ‌ర్ల‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఆహారంగా తీసుకోవ‌డంవ‌ల్ల‌ పోష‌కాహార లోపంతో వ‌చ్చే కొన్నిరకాల వ్యాధులు ధ‌రిచేరవు. ఇవి శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్స్‌ను నివారిస్తాయి.
  • బొబ్బ‌ర్లు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. అంతేగాక హృద‌య సంబంధ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. బొబ్బ‌ర్ల‌లోని ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్, పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచివి.
  • అదేవిధంగా బొబ్బ‌ర్ల‌లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
  • బొబ్బ‌ర్లలోని అధిక ప్రొటీన్‌ కంటెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరుచుకొనేలా చేస్తుంది. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, సి చర్మ కణాలను రక్షిస్తాయి.