Health Tips | అజీర్తితో బాధ పడుతున్నారా..? ఈ రసం తాగితే క్షణాల్లో పొట్టంతా క్లీన్..!
Health Tips | జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లు మారడంతో.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అనారోగ్యానికి గురవుతుంటారు. ప్రధానంగా అందర్నీ వేధించే సమస్య అజీర్తి. ఈ సమస్యతో బాధపడేవారు.. జీర్ణం కాక పుల్లటి త్రేన్సులు వస్తుంటాయి. కొన్ని సార్లు ఆహారం జీర్ణం కాక గొంతులోకి వస్తుంటుంది. ఇది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే.. జీర్ణ రసాలతో పాటు కొన్ని రకాల ఎంజైమ్‌లు కూడా చాలా […]

Health Tips | జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లు మారడంతో.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అనారోగ్యానికి గురవుతుంటారు. ప్రధానంగా అందర్నీ వేధించే సమస్య అజీర్తి. ఈ సమస్యతో బాధపడేవారు.. జీర్ణం కాక పుల్లటి త్రేన్సులు వస్తుంటాయి. కొన్ని సార్లు ఆహారం జీర్ణం కాక గొంతులోకి వస్తుంటుంది. ఇది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే.. జీర్ణ రసాలతో పాటు కొన్ని రకాల ఎంజైమ్‌లు కూడా చాలా అవసరం. ఆహారం జీర్ణం కావడానికి పైత్య రసం, ప్రాంకియాట్రిక్ రసాలతో పాటు ఎమైలేజ్, ప్రొటిలేజ్, లైపేజ్ అనే ఎంజైమ్‌లు కూడా అవసరమే.
ఈ ఎంజైమ్‌లన్నీ తగిన మోతాదులో విడుదల అయితేనే మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. ఇక డాక్టర్లను సంప్రదిస్తే.. మెడిసిన్స్, టానిక్‌లు ఇస్తుంటారు. దీంతో ఆహారం జీర్ణం అవుతుంది. అయితే ఎలాంటి మందులు వాడకుండా కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. మన వంటింట్లో ఉండే జిలకర్రతో అజీర్తి సమస్యకు చెక్ పెట్టొచ్చు. జీలకర్రతో చేసే ఈ నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే జీలకర్రలో ప్రధానంగా థైమాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఈ రసాయనం ఆహారం జీర్ణం అయ్యేందుకు అవసరమయ్యే ఎంజైమ్‌లను, జీర్ణ రసాలను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణరసాలు, ఎంజైమ్‌లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి తిన్న ఆహారం పులియకుండా త్వరగా జీర్ణమవుతుంది. దీంతో అజీర్తి, పుల్లటి త్రేన్పులు, పసురు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇక పొట్ట క్షణాల్లో శుభ్రపడుతుంది.
అజీర్తి సమస్యను తగ్గించే ఈ జీలకర్ర నీటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా మరి.. ఈ నీటిని తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోయాలి.ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి నీటిని మరిగించాలి. ఈ నీటిని ముప్పావు గ్లాస్ అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న జీలకర్ర నీటిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నవారు రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి. ఇలా వారం నుండి పది రోజుల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.