Health tips | మీకు ఈ అనారోగ్య సమస్యలుంటే ఆనిగెకాయ అస్సలు తినొద్దు..!
Health tips : వాస్తవానికి ఏ అనారోగ్యం లేనివాళ్లకు ఆనిగెకాయ ఆరోగ్యకరమైన ఆహారపదార్థం. అదేవిధంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు, ఊబకాయంతో బాధపడుతున్నవారికి, కాలేయ వ్యాధిగ్రస్తులకు కూడా ఆనిగెకాయ మేలు చేస్తుంది. కానీ ఇంత మేలుచేసే కూరగాయతో ప్రతికూలతలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Health tips : వాస్తవానికి ఏ అనారోగ్యం లేనివాళ్లకు ఆనిగెకాయ ఆరోగ్యకరమైన ఆహారపదార్థం. అదేవిధంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు, ఊబకాయంతో బాధపడుతున్నవారికి, కాలేయ వ్యాధిగ్రస్తులకు కూడా ఆనిగెకాయ మేలు చేస్తుంది. కానీ ఇంత మేలుచేసే కూరగాయతో ప్రతికూలతలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆనిగెకాయ అస్సలు మంచిది కాదని అంటున్నారు. కాబట్టి ఆనిగెకాయ ఎవరు తినకూడదు..? ఎందుకు తినకూడదు..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
- కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు ఆనిగెకాయను అస్సలు తినకూడదని, ఆనిగెకాయ రసం తాగకూడదని డైటీషియన్ ప్రీతి పాండే అంటున్నారు. ఆనిగెకాయలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుందని, ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింత పెంచుతుందని ఆమె చెబుతున్నారు.
- బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవాళ్లు కూడా ఆనిగెకాయ తినడం, దాని రసాన్ని తీసుకోవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆనిగెకాయలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్‌ను జీర్ణం చేయడం బలహీన జీర్ణవ్యవస్థకు సాధ్యం కాదు. కాబట్టి అలాంటివారు ఆనిగెకాయ తింటే జీర్ణవ్యవస్థ మరింత దెబ్బతింటుంది. కడుపు నొప్పి, అజీర్తి, మలబద్ధకం, విరేచనాలు లాంటి సమస్యలు వస్తాయి.
- పేగుల్లో పుండ్లు, అల్సర్లు లాంటి సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఆనిగెకాయను తినొద్దని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల జీర్ణకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పేగుల్లో వాపు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని అంటున్నారు.
- లోబీపీ సమస్య ఉన్నవాళ్లు కూడా ఆనిగెకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆనిగెకాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సాయపడుతుంది. దాంతో బీపీ మరింత తగ్గుతుంది. హైబీపీకి మందులు వాడేవాళ్లు కూడా ఆనిగెకాయకు దూరంగా ఉండాలి. సడెన్‌గా బీపీ తగ్గిపోయే ఛాన్స్ ఉందంటున్నారు.
- గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి కూడా ఆనిగెకాయ మంచిది కాదు. కాబట్టి వారు ఆనిగెకాయను, ఆనిగెకాయ జ్యూస్‌ను అత్యంత మితంగా తీసుకోవడం మంచిది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram