Thyroid | మీరు థైరాయిడ్‌తో బాధ‌ప‌డుతున్నారా..? తిన‌కూడ‌ని ఆహార ప‌దార్థాలు ఇవే..!

Thyroid | చాలా మంది థైరాయిడ్( Thyroid )స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. ఇలాంటి వారు కొన్ని ఆహార ప‌దార్థాల‌( Food Items )కు దూరంగా ఉంటే మంచిది. అప్పుడే థైరాయిడ్ కంట్రోల్‌లో ఉండి.. ఆరోగ్యాన్ని( Health ) మెరుగవుతుంది.

  • By: raj    health    Apr 03, 2025 1:03 PM IST
Thyroid | మీరు థైరాయిడ్‌తో బాధ‌ప‌డుతున్నారా..? తిన‌కూడ‌ని ఆహార ప‌దార్థాలు ఇవే..!

Thyroid |  ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. అది వృత్తిరీత్యా కావొచ్చు.. వ్య‌క్తిగ‌త జీవితం కావొచ్చు. ఈ క్ర‌మంలో ప‌ది మందిలో ఐదుగురు అనారోగ్యానికి( Health Issues ) గుర‌వుతున్నారు. ర‌క‌ర‌కాల జ‌బ్బుల బారిన ప‌డి.. ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. మ‌రి ముఖ్యంగా షుగ‌ర్( Sugar ), బీపీ( BP ), థైరాయిడ్( Thyroid ) వంటి వ్యాధులు ప్ర‌తి ఒక్క‌రిని అటాక్ చేస్తూ ఆందోళ‌న‌ను క‌లిగిస్తున్నాయి. షుగ‌ర్, బీపీ ఉన్న వారు త‌మ ఆహార‌పు అల‌వాట్ల‌( Food Habits )లో మార్పులు చేసుకుంటారు. మ‌రి థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు కూడా త‌మ డైట్‌ను పూర్తిగా ఛేంజ్ చేసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు( Health Experts ) సూచిస్తున్నారు. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు థైరాయిడ్ స‌మ‌స్య‌ను తీవ్ర‌త‌రం చేస్తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. కాబ‌ట్టి థైరాయిడ్‌ను కంట్రోల్‌లో ఉంచాలంటే కొన్ని ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే థైరాయిడ్ కంట్రోల్​లో ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం.

థైరాయిడ్‌తో బాధ‌ప‌డుతున్న వారు ఈ ఫుడ్స్ తీసుకోవ‌ద్దు..

-సంతృప్తమైన, ట్రాన్స్ ఫ్యాట్స్​లు శరీరంలో మంటను పెంచుతాయి. థైరాయిడ్ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. ప్రాసెస్ చేసిన మీట్​, వేయించిన ఆహారాలు, డీప్ రోస్ట్ చేసిన ఫుడ్స్ ఇబ్బందులకు గురిచేస్తాయి.

-థైరాయిడ్ ఉన్నవారు సోయా ఉత్పత్తులు తీసుకోకూడదు. ఇవి థైరాయిడ్ మందులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. థైరాయిడ్ పనితీరును తగ్గిస్తుంది.

-బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూర వంటివి పోషకాలతో నిండి ఉన్నప్పటికీ.. థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. ఇవి శరీరంలోని ప్రతికూల ప్రభావాలను ఇస్తుందట.

-థైరాయిడ్ ఉన్న కొందరిలో లాక్టోస్ ఎఫెక్ట్ ఉంటుంది. పాలలోని ప్రోటీన్లకు థైరాయిడ్ మరింత సెన్సిటివ్​గా మారుతుంది. ఇది వాపును ప్రేరేపిస్తుంది.

-అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం వల్ల వాపు ఎక్కువై.. థైరాయిడ్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. షుగర్ ఫ్రీ ఫుడ్ కూడా థైరాయిడ్​ని ట్రిగర్ చేస్తుంది.

ఏ ఆహార ప‌దార్థాలు తీసుకోవ‌చ్చంటే..?

థైరాయిడ్‌తో బాధ‌ప‌డేవారు ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, ప్రాసెస్ చేయని ఆహార ప‌దార్థాల‌ను స‌మ‌తుల్యంగా డైట్​లోకి తీసుకోవాలి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్, సెలీనియం, జింక్ అధికంగా ఉండే ఫుడ్స్ డైట్​లో చేర్చుకోవాలి. చేపలు, బ్రెజిల్ నట్స్ మంచివి. థైరాయిడ్ సరిగ్గా పనిచేయడానికి రోజంతా పుష్కలంగా నీటిని తీసుకోవాలి. హైడ్రేటెడ్​గా ఉంటే మంచిది.