Health Tips | మీ రోజువారీ డైట్‌లో మిల్లెట్స్ భాగమైతే అనారోగ్య సమస్యలన్నీ పరారే..!
Health Tips : ఈ మధ్య కాలంలో మధుమేహం (Blood Sugar), అధిక రక్తపోటు (High blood pressure), థైరాయిడ్, బ్లడ్ కొలెస్టరాల్, గుండె సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతున్నది. దాంతో ప్రజల్లో క్రమంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్నది. ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం మంచిది..? ఎలాంటి ఆహారం హాని చేస్తుంది..? అనే విషయాలపై చర్చస్తున్నారు. చిరుధాన్యాలే (Millets) అన్ని జీవనసంబంధ అనారోగ్య సమస్యలకు ఉత్తమ పరిష్కారం అని గుర్తిస్తున్నారు. అందుకే చిరుధాన్యాలకు డిమాండ్ పెరిగింది.
Health Tips : ఈ మధ్య కాలంలో మధుమేహం (Blood Sugar), అధిక రక్తపోటు (High blood pressure), థైరాయిడ్, బ్లడ్ కొలెస్టరాల్, గుండె సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతున్నది. దాంతో ప్రజల్లో క్రమంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్నది. ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం మంచిది..? ఎలాంటి ఆహారం హాని చేస్తుంది..? అనే విషయాలపై చర్చస్తున్నారు. చిరుధాన్యాలే (Millets) అన్ని జీవనసంబంధ అనారోగ్య సమస్యలకు ఉత్తమ పరిష్కారం అని గుర్తిస్తున్నారు. అందుకే చిరుధాన్యాలకు డిమాండ్ పెరిగింది. ధరలు ఎక్కువైనా ప్రస్తుతం ప్రతి ఇంట్లో రాగులు, సజ్జలు, ఊదలు, సామలు, అరికెలు, కొర్రలు లాంటి చిరుధాన్యాలు దర్శనమిస్తున్నాయి. చిరుధాన్యాలతో ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇవీ లాభాలు..
1. చిరుధాన్యాలు చూడటానికి చిన్నగానే ఉంటాయిగానీ ఇవి పోషకాల గనులు. ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్‌లు, ఖనిజాల లాంటి అత్యవసర పోషకాలెన్నో ఈ చిరుధాన్యాల్లో పుష్కలంగా ఉంటాయి.
2. చిరుధాన్యాల్లో మేలురకం పిండి పదార్థాలు ఉండటంవల్ల జీర్ణక్రియ నియంత్రణకు కూడా బాగా తోడ్పడతాయి. చిరుధాన్యాలను తీసుకోవడంవల్ల చాలాసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. అందువల్ల త్వరగా ఆకలి అనిపించదు. దాంతో బరువు అదుపులో ఉంటుంది.
3. ముఖ్యంగా రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలు ఎముకల పుష్టికి కూడా తోడ్పడతాయి. కీళ్లకు సంబంధించిన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయి.
4. కీళ్ల సమస్యలతో బాధపడేవారు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే వాటిలో పిండి పదార్థం ఎక్కువ. కానీ చిరుధాన్యాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఎముకల బలోపేతానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి.
5. రాగులు, సజ్జల్లో వాపును నివారించే గుణం ఉంటుంది. అందువల్ల కీళ్లలో వాపు తగ్గుతుంది. దాంతో కీళ్లు అరగడంవల్ల తలెత్తే నొప్పులు తగ్గుముఖం పడతాయి.
6. రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల రాగుల్లో 244 మిల్లీ గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అందువల్ల ఎముకలు క్షీణించటం, విరిగిపోవడం లాంటి ముప్పు తగ్గుతుంది.
7. సజ్జల్లో ఫాస్ఫరస్ శాతం ఎక్కువ. ఇది క్యాల్షియంతో కలిసి ఎముకలు బలోపేతం కావటానికి తోడ్పడుతుంది. వంద గ్రాముల సజ్జల్లో 42 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 296 మిల్లీ గ్రాముల ఫాస్ఫరస్ ఉంటాయి.
8. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న రాగులు, సజ్జలను ఆహారంలో విధిగా చేర్చుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాగి, సజ్జ పిండితో రొట్టెలు చేసుకోవచ్చు. రాగి పిండితో జావ చేసుకుని తాగొచ్చు. రాగి జావలో కొంచెం బెల్లం కలిపితే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram