నిమ్మ ర‌సం ఎండాకాలంలో ఎంతో మేలు..! రోగ నిరోధ‌క శ‌క్తి కూడా మెరుగుప‌డుతుంది..!!

ఎండ‌లు ముదిరిపోతున్నాయి. పొద్దున 8 గంట‌ల‌నే భానుడు త‌న ప్ర‌తాపం చూపిస్తున్నాడు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు జ‌నాలు

నిమ్మ ర‌సం ఎండాకాలంలో ఎంతో మేలు..! రోగ నిరోధ‌క శ‌క్తి కూడా మెరుగుప‌డుతుంది..!!

ఎండ‌లు ముదిరిపోతున్నాయి. పొద్దున 8 గంట‌ల‌నే భానుడు త‌న ప్ర‌తాపం చూపిస్తున్నాడు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు జ‌నాలు. చాలా మంది ఈ మండుటెండ‌ల‌కు వ‌డ‌దెబ్బ‌కు గుర‌వుతున్నారు. శ‌రీరం కూడా డీ హైడ్రేట్ అయిపోతోంది. దీంతో శ‌రీరంలో చ‌ల్ల‌ద‌నం కోసం, రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకునేందుకు పండ్ల ర‌సాలు సేవిస్తుంటారు. ఈ ర‌సాల్లో అతి ముఖ్య‌మైన‌ది నిమ్మ ర‌సం. పసుపు పచ్చని రంగులో నిగనిగలాడే నిమ్మ ప్రకృతి మనకు ప్రసాదించిన ఓ అద్భుతమైన వరం.

నిమ్మ పండులో విట‌మిన్ సీ పుష్క‌లంగా ఉంటుంది. దీంతో పాటు కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఈ పోష‌కాలతో నిండి ఉన్న నిమ్మ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. నిమ్మ ర‌సాన్ని తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి కూడా మెరుగుప‌డుతుంది. త‌ద్వారా వ‌డ‌దెబ్బ నుంచి త‌ప్పించుకునే అవ‌కాశం ఉంది. శ‌రీరం కూడా హైడ్రేట్‌గా ఉండేందుకు స‌హాయం చేస్తోంది. ఇంకెందుకు ఆల‌స్యం.. ఈ ఎండాకాలంలో రోజుకు రెండు సార్లైనా నిమ్మ ర‌సం సేవించండి.. ఆరోగ్యంగా ఉండండి.

రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంపొందించుకోవ‌డమే కాదు.. గుండె జ‌బ్బుల ముప్పును కూడా నిమ్మ ర‌సం నివారిస్తోంది. మూత్ర‌పిండాల్లో రాళ్ల‌ను కూడా నివారిస్తోంది. శ‌రీర క‌ణ‌జాలం పెరుగుద‌ల‌, అభివృద్ధికి విట‌మిన్ సీ కీల‌క‌పాత్ర పోషిస్తోంది. నిమ్మ‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి. కాబ‌ట్టి గొంతు నొప్పితో బాధపడేవారు.. ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీళ్లలో అరస్పూన్‌ తేనె, స్పూన్‌ నిమ్మరసం కలిపి తాగితే మీకు త్వరగా ఉపశమనం లభిస్తుంది.

నిమ్మరసం మూత్రంలో సిట్రేట్‌ స్థాయిలను పెంచి.. మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది. సిట్రేట్ కాల్షియంకు అతుక్కుంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది. నిమ్మరసంలో ఫైబర్‌ మెండుగా ఉంటుంది.. దీనిలో ఉండే లో డెన్సిటీ ఫైబర్‌ శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడానికి, బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. నిమ్మ‌రసం జీర్ణ‌క్రియ‌ను కూడా మెరుగుప‌రుస్తుంది. అజీర్ణం, మ‌ల‌బ‌ద్దకం వంటి స‌మ‌స్య‌ల‌ను నివారించొచ్చు. నిమ్మ‌ర‌సం శ‌రీరం నుంచి వ్యర్థాల‌ను తొల‌గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

నిమ్మ‌ర‌సంలో ఉండే ఫైబ‌ర్ కార‌ణంగా రక్తంలో గ్లూకోజ్‌‌ని అదుపులో ఉంచుతుంది. తద్వారా చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. నిమ్మరసం తీసుకుంటే డయాబెటిస్‌ వచ్చే ముప్పు తగ్గుతుంది. షుగర్‌ పేషెంట్స్‌ రోజూ నిమ్మరసం తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.