Mosquito Borne Disease | వర్షాకాలం.. వ్యాధుల కాలం..! డెంగ్యూ-మలేరియాతో జాగ్రత్త..! వీటి లక్షణాలను ఎలా గుర్తించాలంటే..?

Mosquito Borne Disease | వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు సోకుతుంటాయి. ముఖ్యంగా దోమలతో వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. భారీ వర్షాల కారణంగా నీరు నిలిచిపోవడం, వరద పరిస్థితులు దోమల సంతానోత్పత్తి అత్యంత అనుకూలంగా ఉంటాయి. దాంతో డెగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా బాధితుల సంఖ్య ఎక్కువగా వర్షాకాలంలోనే ఉంటుంది. జులై మొదటి రెండువారాల్లోనే ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో డెంగ్యూ కేసులు భారీగా పెరిగాయని నివేదికలు పేర్కొంటున్నాయి. చాలా మంది కోలుకుంటున్నప్పటికీ.. ఈ సారి ఢిల్లీని […]

Mosquito Borne Disease | వర్షాకాలం.. వ్యాధుల కాలం..! డెంగ్యూ-మలేరియాతో జాగ్రత్త..! వీటి లక్షణాలను ఎలా గుర్తించాలంటే..?

Mosquito Borne Disease |

వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు సోకుతుంటాయి. ముఖ్యంగా దోమలతో వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. భారీ వర్షాల కారణంగా నీరు నిలిచిపోవడం, వరద పరిస్థితులు దోమల సంతానోత్పత్తి అత్యంత అనుకూలంగా ఉంటాయి. దాంతో డెగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా బాధితుల సంఖ్య ఎక్కువగా వర్షాకాలంలోనే ఉంటుంది.

జులై మొదటి రెండువారాల్లోనే ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో డెంగ్యూ కేసులు భారీగా పెరిగాయని నివేదికలు పేర్కొంటున్నాయి. చాలా మంది కోలుకుంటున్నప్పటికీ.. ఈ సారి ఢిల్లీని వరదలు ముంచెత్తిన తీరును చూస్తుంటే రాబోయే రోజుల్లో దోమల ద్వారా వ్యాధులు సంక్రమించే ప్రమాదం భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా ఇలాంటి వైరల్‌ ఫీవర్స్‌ మానవ శరీరానికి తీవ్రంగా హాని చేస్తాయని పేర్కొంటున్నారు. ఈ వైరల్‌ ఫీవర్స్‌ కారణంగా ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీటి తీవ్రతను అర్థం చేసుకోవడంతో పాటు నివారణ చర్యలపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌ గున్యా ఈ మూడు వివిధ రకాల వ్యాధులు, తీవ్ర భిన్నంగా ఉంటుందని, వాటి మధ్య తేడాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..!

డెంగ్యూ గురించి..

డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ (DENV) వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ సోకిన దోమలు పగటిపూట ఎక్కువగా కుడతాయి. ఈ నేపథ్యంలో అందరు దాదాపు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డెంగ్యూ సాధారణ లక్షణాల్లో అధిక జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలుంటాయి.

డెంగ్యూ తీవ్రంగా ఉంటే.. జ్వరంతో పాటు రక్తస్రావానికి దారి తీస్తుంది. రక్తస్రావం, రక్తపోటులో అకస్మాత్తుగా పడిపోవడంతో పాటు మరణానికి సైతం దారి తీస్తుంది. రక్తంలో ప్లేట్‌లెట్స్ చాలా వేగంగా తగ్గుతూ వస్తాయి. డెంగ్యూ సోకిన వ్యక్తికి దూరంగా ఉండాలి. అదే సమయంలో దోమలు వృద్ధి చెందకుండా, కుట్టకుండా చర్యలు తీసువాలి. దాంతో డెంగీ సోకిన వ్యక్తిని మరొకరికి సోకేందుకు అవకాశాలుండవు.

మలేరియా..

డెంగ్యూలాగే మలేరియా కూడా తీవ్రమైన వ్యాధి. మలేరియా అనేది పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధి. ఈ పరాన్నజీవులు సోకిన దోమల కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తాయి. మలేరియా ఉన్న వ్యక్తులు సాధారణంగా అధిక జ్వరం, చలితో వణికిపోతుంటారు. మలేరియా కూడా తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతుంది. మలేరియాతో ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో కిడ్నీ, కాలేయం సైతం దెబ్బతింటుంది.

చికున్‌గున్యా ప్రమాదం

చికున్‌గున్యా అనేది చికున్‌గున్యా వైరస్ (CHIKV) వల్ల దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ఈ వ్యాధి మొదటి లక్షణాలు సాధారణంగా జ్వరం, చర్మపై దద్దుర్లు కనిపిస్తాయి. అంతేకాకుండా రోగులకు అకస్మాత్తుగా అధిక జ్వరం (సాధారణంగా 102°F పైన), కీళ్ల నొప్పులు, తలనొప్పి, వికారం వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయి.

చికున్‌గున్యాకు నిర్దిష్ట యాంటీవైరల్ మందులు లేవు. వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలను బట్టి చికిత్స చేయడంతో పాటు రోగి పుష్కలంగా ద్రవాలు తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవాలని సూచనలు చేస్తుంటారు.

వైరల్‌ ఫీవర్స్‌ను ఎలా నివారించాలంటే..?

దోమల వల్ల వచ్చే వ్యాధులన్నింటిని అరికట్టాలంటే దోమకాటును నివారించాలని సూచిస్తున్నారు. ఒళ్లంతా కవర్‌ చేసేలా బట్టలు ధరించాలని, రాత్రి పడుకునేటప్పుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచడంతో పాటు దోమతెరలు వాడాలని సూచిస్తున్నారు.

దోమలు రాకుండా ఉండేందుకు ఎక్కువగా కాయిల్స్‌ వాడుతుంటారు. కానీ ఇవి మనుషులకు హానికరం. వాటి వినియోగం తగ్గించాలి. ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.