Liver Cancer  | ఇక 60 శాతం కాలేయ క్యాన్సర్లకు చెక్!

క్యాన్సర్ అనగానే భయపడని వాళ్లు ఉండరు. కానీ కొన్ని రకాల క్యాన్సర్లకు వాక్సిన్లు ఉన్నాయి. వాక్సిన్లు లేని క్యాన్సర్లలో కూడా కొన్నింటిని నివారించడం సాధ్యమే. అలాంటి వాటిలో ఒకటి లివర్ క్యాన్సర్ అని చెబుతోంది ఇటీవల జరిగిన లాన్సెట్ స్టడీ.

  • By: TAAZ    health    Aug 01, 2025 11:21 AM IST
Liver Cancer  | ఇక 60 శాతం కాలేయ క్యాన్సర్లకు చెక్!

Liver Cancer  | ఊపిరితిత్తుల క్యాన్సర్ల తర్వాత ఎక్కువ మందిని కబళిస్తున్నది లివర్ క్యాన్సర్. కానీ కాలేయ క్యాన్సర్లను నివారించడం సాధ్యమేనని లాన్సెట్ అధ్యయన నివేదిక వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లివర్ క్యాన్సర్‌ కేసుల్లో మూడింట రెండింటిని నివారించగలమని, ముఖ్యమైన ప్రమాదకారక అంశాలను అదుపులోకి తెచ్చినట్లయితే ఈ మరణాంతక వ్యాధిని తగ్గించవచ్చనేది ఈ నివేదిక సారాంశం.

హెపటైటిస్ వ్యాధులు, మద్యపాన అలవాట్లు, నాన్- ఆల్కహాలిక్ ఫ్యాటి లివర్ లాంటి సమస్యలే లివర్ క్యాన్సర్‌కు ప్రధాన మూలాలు అని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ నివేదికను హాంగ్‌కాంగ్ క్యాన్సర్ ఇనిస్టస్టిట్యూట్, ఫుడాన్ యూనివర్సిటీ, చైనా, దక్షిణ కొరియా, అమెరికా, యూరోప్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా అందించారు.

ఆల్కహాల్ ఎక్కువగా తాగేవాళ్లకు మాత్రమే కాలేయ క్యాన్సర్ వస్తుందని అనుకుంటారు చాలామంది. కానీ ఒబెసిటీ, లివర్ లో ఇన్ ఫెక్షన్లు, మెటబాలిక్ డిసీజెస్ కూడా లివర్ క్యాన్సర్ కి దారితీయవచ్చు. హెపటైటిస్ బి, సి వైరస్ ల ఇన్ ఫెక్షన్లు కాలేయ కణాలపై పనిచేసి, క్రమంగా లివర్ క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంది. అదే విధంగా ఎక్కువగా మద్యం తీసుకునేవాళ్లలో కాలేయంలో కొవ్వు చేరి (ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్), తద్వారా ఎంజైమ్ డిజార్డర్లు ఏర్పడి క్యాన్సర్ రావొచ్చు. ఇక మరో ముఖ్యమైన కండిషన్ ఒబెసిటీ. అధిక బరువు, స్థూలకాయం ఉన్నవాళ్లలో లివర్ లో కొవ్వు పేరుకుపోయి, ఫాటీ లివర్ వస్తుంది. ఇలా లివర్ లో కొవ్వు చేరితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లే దీనికి కారణం.

హెచ్చరిస్తున్న జబ్బులు

ఇప్పుడు లాన్సెట్ పత్రిక ప్రస్తావించిన సమస్యలు ఎంఎఎస్ఎల్ డి (MASLD) అంటే మెటబాలిక్ డిస్ ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియోటోటిక్ లివర్ డిసీజ్, ఇంకోటి మెటబాలిక్ డిస్ ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియోటోహెపటైటిస్ (MASH) అనే తీవ్రమైన కాలేయ సమస్యలు లివర్ సిర్రోసిస్ కి, తర్వాత క్యాన్సర్ కి దారితీస్తాయి. లివర్ క్యాన్సర్లు 35 శాతం పెరగడానికి ఈ సమస్యలే దోహదపడుతాయని లాన్సెట్ నివేదిక హెచ్చరించింది.

నివారణ 60 శాతం!

60 శాతం వరకు లివర్ క్యాన్సర్లను నివారించడం మన చేతుల్లోనే ఉందంటోంది ఈ నివేదిక.

  • హెపటైటిస్‌కి వ్యాక్సిన్ వేయించుకోవాలి.
  • మద్యం తగ్గించాలి, లేదా పూర్తిగా మానాలి.
  • ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. తక్కువ కొవ్వు, తక్కువ చక్కెర, ఎక్కువ నడక అలవాటు చేసుకోవాలి.
  • లివర్ సంబంధిత పరీక్షలను రెగ్యులర్‌గా చేయించుకోవాలి – ముఖ్యంగా డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవాళ్లు చిన్న చిన్న విషయాల్లో కూడా అశ్రద్ధ చేయకూడదు.

ఇవి కూడా చదవండి..

Rainy Season Health Tips | ఈ ఇన్‌ఫెక్షన్ల కాలంలో ఇమ్యూనిటీ పెంచేదెలా?
Teeth Health: పళ్లు తోమకపోతే.. గుండె పోటు!
Kingdom (2025) Review | ఉద్రేక, ఉద్వేగాల ప్రయాణం : ‘కింగ్‌డమ్‌’– రౌడీ ఎదురుచూపులకు ఫలితం దక్కిందా?